ETV Bharat / state

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చారిత్రాత్మకం - అసలైన ఆట ఇప్పుడే మొదలైంది : మంత్రి రాజనర్సింహ - RAJANARSIMHA ON SC CLASSIFICATION - RAJANARSIMHA ON SC CLASSIFICATION

MINISTER RAJANARSIMHA ON SC CLASSIFICATION : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ నెల 16 లేదా 17న సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, మాదిగల సమ్మేళనం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

SC CLASSIFICATION IN TELANGANA
MINISTER RAJANARSIMHA ON SC CLASSIFICATION (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 7:50 PM IST

SC CLASSIFICATION IN TELANGANA : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడే ఆట మొదలైందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. జులై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని, ధర్మాసనం తీర్పును అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి ఎప్పుడూ రుణపడి ఉంటుందని మంత్రి తెలిపారు. బేగంపేటలోని ఓ హోటల్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

SC, ST ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా- రాష్ట్రాలకు అధికారం ఉందని తీర్పు - SC ST sub classification

ఆత్మీయ సమ్మేళనం : ఎస్సీ వర్గీకరణపై కేవలం తీర్పు రాగానే సంతోషపడకూడదని, దేని ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తారో సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయాలని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ నెల 16 లేదా 17న మాదిగల సమ్మేళనం పెద్దఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. మాదిగ జాతి ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, అన్ని జాతులతో సమానమని, మాదిగ జాతిని అవమాణిస్తే కండిస్తాం, ఎదురిస్తామన్నారు.

సీనియర్ న్యాయవాదులతో సుప్రీం తీర్పు కాపీలను క్షుణ్నంగా పరిశీలించమని చెప్పనున్నట్లు మంత్రి రాజనర్సింహ తెలిపారు. గతంలో ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలు ఏబీసీడీ వర్గం కరెక్ట్ కాదన్న సుప్రీంకోర్టు, నేడు సమర్థించిందని మంత్రి గుర్తు చేశారు. మాదిగల్లో మార్పు రావాలని, అందరూ సంస్కారవంతులు కావాలని మంత్రి సూచించారు. ఆర్థిక వ్యవస్థ అనేది ఏ ఒక్క వర్గం చేతిలో ఉండకూడదని, అది అత్యంత ప్రమాదకరమని మంత్రి పేర్కొన్నారు.

"ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం. సుప్రీం తీర్పు కాపీలను క్షుణ్నంగా పరిశీలించడానికి సీనియర్ న్యాయవాదులను నియమించి, దాని సారాంశం ఆధారంగా రాష్ట్రంలో వర్గీకరణ చేపట్టాలని సీఎంకు విన్నవిద్దాం". - రాజనర్సింహ, మంత్రి

సీఎం నిర్ణయం హర్షణీయం : అప్పట్లో మాదిగ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారని సీనియర్​ నేత మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. మాదిగలకు ఎన్టీఆర్​ గుర్తింపు తెచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ తన కంటే చిన్నవాడైనా మాదిగలకు తండ్రి స్థానంలో ఉండి సహాయం చేశాడని, గ్రూప్-1, ఇతర ఉద్యోగాల్లో ఏబీసీడీ అమలు అయ్యేలా చేస్తామని సీఎం చెప్పడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్​ అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలు - అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన - REVANTH ON SC ST SUB CLASSIFICATION

ఎస్సీ వర్గీకరణ చిక్కుముడిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - రిజర్వేషన్ల విధానంపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ? - Supreme Court On SC ST Quota

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.