Minister Atchannaidu on Youth Stuck in Saudi Arabia : శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది యువకులు సౌదీ అరేబియాలో చిక్కుకున్నారని వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏజెంట్ల ద్వారా మోసపోయిన యువకులను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబుతో ఈ అంశంపై చర్చించి తక్షణమే చర్యలు తీసుకుంటామని అచ్చెన్న వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది యువకులు సౌదీ అరేబియాలో చిక్కుకున్నారు. ఏజెంట్ల ద్వారా మోసపోయిన జిల్లా యువకులను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తాము. కేంద్ర మంత్రి @RamMNK గారు, ముఖ్యమంత్రి @ncbn గారితో ఈ అంశంపై చర్చించి తక్షణమే చర్యలు తీసుకుంటాము. ఉత్తరాంధ్ర… pic.twitter.com/0dqaDvKkgY
— Kinjarapu Atchannaidu (@katchannaidu) December 3, 2024
ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమాభివృద్ధికి, యువతలో నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని మంత్రి అన్నారు.
నిర్మించని గృహాలన్నీ రద్దు - ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం
ప్రమాదాలకు గేట్లు తెరిచిన ద్వారంపూడి - పరిశ్రమను సీజ్ చేయించిన PCB