ETV Bharat / state

చీరలో యువకుడు - పంచెకట్టులో యువతి - ఆ ఊర్లో 'జంబలకిడి పంబ' - MEN DRESS UP LIKE WOMEN

ఏపీలోని ప్రకాశం జిల్లా శానంపూడి పంచాయతీ పరిధిలో వింత ఆచారం - వివాహం నిశ్చయమైతే యువకుడికి చీర కట్టి అమ్మాయిలా ముస్తాబు - యువతికి పంచె కట్టి, చొక్కా ధరింపజేసి యువకుడిగా అలంకరణ

Men Dress Up Like Women
Men Dress Up Like Women To Perform Rituals (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2024, 9:15 AM IST

Men Dress Up Like Women To Perform Rituals : పెళ్లి వేడుకల్లో వధూవరులకు ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది. ఆయా ప్రాంతాలు, ఆచార వ్యవహారాలపై ఇది ఆధారపడి ఉంటుంది. అందులోనూ పలు ప్రత్యేకతలు ఉంటాయి. ఇటువంటిదే ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలోనూ ఓ వింతైన ఆచారం కొనసాగుతోంది. పెళ్లి కుదిరిందంటే చాలు ఇక్కడ ఒక రోజంతా 'జంబలకిడి పంబ'గా తిరగాల్సిందే. పెళ్లయ్యే యువకుడు అమ్మాయిలా అలంకరించుకొని రావాల్సి ఉంటుంది. అమ్మాయి అబ్బాయిలా పంచె ధరిస్తుంది. ఇదెక్కడి ఆచారం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

చీర కట్టి అమ్మాయిలా : ప్రకాశం జిల్లా శానంపూడి పంచాయతీ పరిధిలోని పటికనేనివారి పాలెంలో కోడిపల్లి అనే ఇంటి పేరు కలిగిన కుటుంబాలు సుమారు 100 వరకు జీవిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన వృత్తి వ్యవసాయం. పాడిని అనుబంధంగా చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ఇక్కడ తమ దైవంగా నాగార్పమ్మను పూజిస్తుంటారు. ఈ కుటుంబాల్లోని ఎవరైనా యువకుడికి వివాహం కుదిరితే చాలు తమ ఆచారాలతో జరిపిస్తారు. అబ్బాయికి చీర కట్టి అమ్మాయిలా తయారు చేస్తారు. అమ్మాయికి పంచె కట్టి, చొక్కా ధరింపజేసి యువకుడిగా అలంకరిస్తారు.

అమ్మాయి అబ్బాయిలా : చేతిలో త్రిశూలం, మరో చేతిలో గంధం పట్టుకుంటారు. దాని తర్వాత బోనం ఎత్తుకుని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గ్రామ శివారులోని వీరుల జమ్మి చెట్టు వద్దకు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ క్రతువు పూర్తయ్యే వరకు సదరు యువతీ, యువకులు ఇతరులు ఎవరితోనూ అస్సలు మాట్లాడకూడదు. వంశాభివృద్ధి కోసం పూర్వీకులు ఈ ఆచారాన్ని పాటించే వారని అక్కడి గ్రామస్థులు, ఆ వంశస్థులు తెలుపుతున్నారు. అందుకే ఇప్పటికీ అదే విధానాన్ని తాము కొనసాగిస్తున్నట్లు వారు తెలుపుతున్నారు. ఇలా చేస్తే ఇరు కుటుంబాలకు మంచి జరుగుతుందని తాము బలంగా నమ్ముతామని చెబుతున్నారు.

బండపై నైవేద్యాన్ని ఉంచి నాకితే వర్షాలు పడతాయట - ఈ గ్రామ ప్రజల వింత ఆచారం - Different Culture In Medak district

'తలారి చెరువు'లో అగ్గిపాడు ఆచారం- ఆ రోజు ఊరంతా ఖాళీ 'అర్ధరాత్రి దాటాక !'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.