ETV Bharat / state

'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' - అక్కడ మగవాళ్లూ ఆడతారు! - bathukamma Celebrations 2024 - BATHUKAMMA CELEBRATIONS 2024

ఇక్కడ మగవాళ్లు బతుకమ్మ ఆడతారు - అక్కడ దసరా రోజు జాతీయ జెండా ఎగురవేస్తారు

Men Played Bathukamma at Husnabad
Men Played Bathukamma at Husnabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2024, 1:38 PM IST

Men Played Bathukamma at Husnabad : తెలంగాణలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మహిళలంతా సంప్రదాయ చీరలు, ఆభరణాలు ధరించి, టీనేజ్​ అమ్మాయిలైతే లంగా ఓణీ/ హాఫ్​ - సారీలు ధరించి చూడముచ్చటగా ముస్తాబవుతారు. ఆ తర్వాత వారంతా బతుకమ్మలను ఒకచోట చేర్చి రామ రామ రామ ఉయ్యాలో అంటూ లయబద్ధంగా పాడుతూ స్టెప్​లు వేస్తూ బతుకమ్మ ఆడతారు. ఒక రకంగా చెప్పాలంటే బతుకమ్మ అనేది స్త్రీలకు చెందిన పండుగగా చెప్పొచ్చు. కానీ మన రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం ఆడవాళ్లే కాదు మగవాళ్లు సైతం బతుకమ్మ ఆడతారు. అదేంటి మహిళామణులు ఆడే బతుకమ్మను మగవాళ్లు ఆడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలంలోకి వెళితే రంగురంగుల పూలను తెచ్చి, చక్కగా పేర్చి మగవాళ్లు బతుకమ్మలు ఆడటం కనిపిస్తుంది. ఆడవాళ్లతో పాటే వాళ్లు కూడా తలమీద బతుకమ్మను పెట్టుకుని ఊరేగింపుగా వెళతారు. మహిళలతో కలిసి పాటలు పాడుతూ ఆడతారు. మొదట హుస్నాబాద్​ మండలం తోటపల్లిలో ఏటా దసరా నవరాత్రుల్లో ఈ విధంగా మగవారూ సందడి చేసేవారు. దశాబ్దాలుగా ఈ సంప్రదాయాన్ని ఆ గ్రామస్థులు పాటిస్తున్నారు. వారి స్ఫూర్తితో ఇప్పుడు చుట్టుపక్కల మండలాల్లోనూ బతుకమ్మ వేడుకల్లో మగవారే ముందు వరుసలో ఉంటున్నారు. ఈ మగవాళ్ల బతుకమ్మను మీరూ చూడాలనుకుంటే అలా హుస్నాబాద్​ వెళ్లి చూసేయండి.

Men Played Bathukamma at Husnabad
సిద్దిపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దసరా రోజు జాతీయ జెండా ఎగురవేత (ETV Bharat)

దసరా రోజు జెండా వందనం : తెలంగాణలో దసరా రోజు ఎవరైనా జమ్మి చెట్టు దగ్గర శమీ పూజలు చేస్తారు. కానీ సిద్దిపేట జిల్లా గజ్వేల్​ మండలంలోని ప్రజ్ఞాపూర్​, రిమ్మన్​గూడ, జలిగావ్​ లాంటి కొన్ని ఊళ్లలో మాత్రం జాతీయ జెండాకు వందనం చేస్తారు. జమ్మి చెట్టుకు శమీ పూజ కన్నా ముందు ఊరివాళ్లు అందరూ ఈ పద్ధతి పాటిస్తారు. ఎందుకంటే ఇలా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఈ గ్రామాల్లో ఈ పద్ధతి కొనసాగుతోంది. కేవలం స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవాల్లోనే కాకుండా దసరా రోజునా ఈ గ్రామాల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. తెలంగాణలో జమ్మి చెట్టు దగ్గర శమీ పూజ చేసి జమ్మి ఆకులను బంగారం పేరుతో ఊరంతా పంచుతారు.

బతుకమ్మ ఆడితే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా - ఎలాగో తెలుసా? - Bathukamma Flowers History

'మంచు'లో బతుకమ్మ ఆడాలని ఉందా? - ఎక్కడికో అవసరం లేదు - మన కొండాపూర్​ వచ్చేయండి - BATHUKAMMA CELEBRATIONS IN SNOW

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.