ETV Bharat / state

మేడిగడ్డకు కొత్త సమస్యలు - ఏడో బ్లాక్‌ ప్రాంతంలో భారీ బుంగ - Medigadda Barrage Repairs - MEDIGADDA BARRAGE REPAIRS

Medigadda Barrage Temporary Repairs : మేడిగడ్డ బ్యారేజీకి కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. తాత్కాలిక మరమ్మతుల్లో ఏడో బ్లాక్‌ ప్రాంతంలో భారీ బుంగ బయటపడింది. దీంతో పాటు మరికొన్ని చిన్నచిన్నవి ఏర్పడిట్లు తేలింది. వీటిని ఇంజినీరింగ్‌ అధికారులు పూడ్చివేశారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్‌ నివేదిక అందుబాటులో లేదని తెలిసింది.

Medigadda Barrage Issue
Medigadda Barrage Temporary Repairs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 8:51 AM IST

Medigadda Barrage Issue : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా 25వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. తాజాగా ఏడో బ్లాక్‌ వద్ద ఏరియా క్లియరెన్స్‌ పనులను చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న నీటిని పూర్తిగా తోడేయగా 20వ పియర్‌ ప్లాట్‌ఫాం ఎదుట పెద్ద బుంగ బయటపడింది. బుంగను ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించి శుక్రవారం సాయంత్రానికి పూడ్చేశారు. ఏడో బ్లాక్‌ ప్రదేశంలో పలు చోట్ల చిన్న బుంగలు ఏర్పడగా వాటిని కూడా పూడ్చేసినట్లు తెలిసింది.

గతంలో బ్యారేజీకి దిగువన సీకెంట్‌ పైల్స్‌కు 20 మీటర్ల దూరంలో బయటపడిన భారీ గొయ్యిని ఇసుక బస్తాలతో పూడ్చేశారు. అయితే ఇప్పుడు సీసీ బ్లాకులకు దగ్గరగా పెద్ద బుంగను గుర్తించారు. ఇన్వెస్టిగేషన్స్‌ పూర్తయితే కానీ వాటి తీవ్రత, ఏర్పడటానికి కారణం తెలియదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘బుంగలు పడటమంటే ఫాల్ట్‌జోన్‌ ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. పైన అంతా ఇసుక గట్టిగానే ఉండి మధ్యలో నీటి ప్రవాహం ఉండటం, బర్రీడ్‌ ఛానల్స్‌ ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికలో కూడా పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

యుద్ధప్రాతిపదికన మేడిగడ్డ మరమ్మతులు - వచ్చే వారం బ్యారేజీ పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి - MEDIGADDA BARRAGE REPAIRS

అయితే ఎన్‌డీఎస్‌ఏ మధ్యంతర నివేదికలో పేర్కొన్న ఐ.ఎస్‌.కోడ్‌లు నిర్మాణ సంస్థలతో చేసుకొన్న ఒప్పందాల్లో లేవని, దానివల్ల నిర్మాణ సమయంలో ఈ పరీక్షలు చేసి ఉండకపోవచ్చని కూడా ఇంజినీర్లు పేర్కొంటున్నారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్‌ నివేదిక అందుబాటులో లేదని తెలిసింది. ‘అసలు జీఎస్‌ఐతో సర్వే చేయించారా లేదా అనేదానిపై కూడా స్పష్టత లేదని అధికారులు భావిస్తున్నారు.

మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ గేట్లన్నీ ఎత్తి ఉంచాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఆరో బ్లాక్‌ వరకు, అలాగే ఎనిమిదో బ్లాక్‌లోను ఉన్న మొత్తం గేట్లు 74 పూర్తి స్థాయి నీటిమట్టం వరకు ఎత్తి ఉంచారు. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లో మొత్తంగా 11 గేట్లు ఉండగా ఎనిమిది గేట్లపై ప్రభావం ఉండడంతో అవి మూసి ఉన్నాయి. ఇందులో మిగిలిన వాటితో కూడా కలిపి మొత్తం 77 గేట్లు పైకెత్తారు. రెండు గేట్లను పూర్తిగా తొలగించాలి. ఆరు ఎత్తాల్సి ఉంది. ఇందులో ఒక గేటు 90 మీటర్ల వరకు మాత్రమే ఎత్తారు. మిగిలిన గేట్లన్నీ అలానే ఉన్నాయి. 16వ నంబరు గేటు ఎత్తే ప్రయత్నం చేయగా పగుళ్లు మరింత పెరగడంతో నిలిపివేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మిగిలిన గేట్లను ఎత్తడం సమస్యగా మారే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

మేడిగడ్డ నుంచి నీటి ఎత్తిపోతలకు ప్రత్యామ్నాయాలపై సర్కార్‌ ఫోకస్ - కన్నేపల్లి వద్ద సరిపడా నీటిమట్టం ఉండేలా కసరత్తు! - Water Diversion to kannepalli

శరవేగంగా మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతులు - ఏరియా క్లియరెన్స్​ పనులు చేస్తున్న ఇంజినీర్లు - Medigadda Barrage Damages Repair

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.