ETV Bharat / state

ఇల్లందులో ముసుగు దొంగ హల్​చల్ - సీసీకెమెరాలో రికార్డయిన దృశ్యాలు - వీడియో వైరల్​ - Masked Thief Hal Chal in Khammam - MASKED THIEF HAL CHAL IN KHAMMAM

Masked Thieves in Bhadradri Video Viral: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ దొంగ ముసుగు వేసుకుని చోరీ చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్తూ దొంగతనం చేసేందుకు యత్నించాడు. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దృశ్యాలను గమనించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Thief trying to Robbery Live Video
Masked Thief Hal Chal CCTV Footage (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 2:01 PM IST

సీసీ కెమెరాకు చిక్కిన ముసుగు దొంగ వీడియో వైరల్​ (ETV Bharat)

Masked Thieves in Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొతరకం దొంగలు పడుతున్నారు. రాత్రి సమయంలో ఎవరూ తిరగని ప్రదేశాల్లో ముసుగు వేసుకుంటూ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి నచ్చిన వస్తువులను తీసుకు వెళ్లి యజమానులను నగదు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటున్నాయని తెలుసుకున్న చోరులు ముఖానికి ముసుగులు వేసుకుని మరీ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా జిల్లాలో ఓ దొంగ చోరీకి ప్రయత్నిస్తున్న సమయంలో సీసీ కెమెరాల్లో చిక్కాడు. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇల్లందులోని సుభాశ్​ నగర్​, జేకే కాలనీల్లో రెండు రోజుల క్రితం ఒక ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసే అవకాశం లేకపోవడంతో ఓ దొంగ ఇంటి మీద నుంచి గోడలపై నడుస్తూ తాపీగా గోడ దిగి వెళ్లిన దృశ్యం ఎదురింటి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ముసుగు దొంగలు తిరుగుతున్న ఆ వీధుల్లో చాలా మందికి ద్విచక్రవాహనాలు, కార్లు ఉన్నందున వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. అనంతరం ఆ దొంగని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

తాళం వేసిన ఇళ్లే ఆదొంగల టార్గెట్ - నగరంలో బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు - Massive theft in Shameerpet

గతంలో ముసుగు దొంగలు చోరీ చేసే ఘటనలు జిల్లాలో జరిగాయని పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఒకరి ఫోన్​ దొంగిలించాడని, అనంతరం దాన్నుంచే ఆ యజమానికి కాల్​ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేశాడని తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో లోకేషన్​ ట్రాక్ చేసి దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు కొన్నిరోజుల క్రితం ఒక పాఠశాలలో ల్యాప్​టాప్​ ఇతర సామగ్రి దొంగిలించిన ఓ దొంగ స్కూల్​ సిబ్బందికి వాట్సాప్​లో ఫొటోలు పెట్టి మరీ డబ్బులు డిమాండ్ చేశాడు. నిందితుడు కాజీపేటలో ఉన్నాడని తెలుసుకుని అక్కడి పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. తరవాత రిమాండ్​కు పంపించారు. ఇంకో కేసులో గతంలోనూ ఓ మైనర్​ బాలుడు దొంగతనాలు చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు తన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చి అతణ్ని వదిలిపెట్టారు.

మేడ్చల్‌ జిల్లాలో భారీ చోరీ - ఫంక్షన్​కు వెళ్లొచ్చేలోపు దోచేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.