Marriage Of Peepal And Neem Tree : తెలుగు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాలు ఆచరించే కార్తిక మాసం ప్రారంభమైంది. ఈ పవిత్ర మాసం సందర్భంగా ఓ అరుదైన పెళ్లి జరిగింది. ఇందులో విశేషం ఏముందిలే అనుకుంటున్నారా? అయితే ఇక్కడ వివాహం జరిగింది అమ్మాయి, అబ్బాయికి కాదండోయ్. రావి చెట్టుకు, వేప వృక్షానికి కల్యాణం జరిగింది. అరుదైన ఈ వివాహాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు కూడా తరలివచ్చారు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగింది? ఇలా వేప చెట్టుకు, రావి చెట్టుకు వివాహం చేసిన నిర్వాహకులు ఏమంటున్నారనే విషయాలు తెలుసుకుందాం.
వేపచెట్టుకు, రావిచెట్టుకు పెళ్లి : వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో శ్రీ సంకల్ప సిద్ధి సాయినాథ ఆలయంలో శనివారం ఆలయ నిర్వాహకులు బాజా బజంత్రీలతో రావిచెట్టు, వేపచెట్టుకు పెళ్లి చేశారు. కల్యాణ వేడుకలో నిర్వహించే తరహాలోనే అన్ని పూజా కార్యాక్రమాలను వేదపండితులతో శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పెళ్లి వేడుకలో భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం విందు భోజనాలను ఏర్పాటు చేశారు.
ఇంతకీ ఈ విధంగా ఎందుకు చేస్తారంటే : రావి, వేప వృక్షాలు లక్ష్మీనారాయణ స్వరూపమనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దేవాతా వృక్షాలను పూజించడం వల్ల జీవితంలోని సకల దోషాలు తొలగిపోతాయని వారి విశ్వాసం. దీంతో పాటు ఇలా చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని వారు నమ్ముతారు. అందువల్లనే రావిచెట్టుకు, వేపచెట్టుకు పెళ్లి చేశారు.
భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి మన దేశంలో ఇలాంటి సంప్రదాయాలు చాలా కనిపిస్తుంటాయి. కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయనేది కూడా ఇలాంటి ఆచారమే. మరికొన్ని ప్రాంతాల్లో గోవులకు కల్యాణం నిర్వహించడం కూడా మనం చూస్తుంటాం. ఇలా ఒక్కో ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. అనాదిగా వాటని ప్రజలు పాటిస్తూ వస్తున్నారు. ప్రకృతి శక్తులను ఆరాధించడం కోసం పురాతనమైన ఆచారమే.
ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో ప్రేమ.. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఒకే వేదికపై పెళ్లి