Margadarsi Chit Fund 114th Branch in Coimbatore: నమ్మకానికి మారుపేరైన మార్గదర్శి చిట్ ఫండ్ తన 114వ శాఖను నేడు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ప్రారంభించారు. కోయంబత్తూరులోని అవినాశ్ రోడ్ హోప్ కాలేజీ ప్రాంతంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణ పాతూరి, ఉపాధ్యక్షుడు బలరామకృష్ణ రిబ్బన్ కట్ చేసి దీపాలు వెలిగించి నూతన శాఖను ప్రారంభించారు. కోయంబత్తూరు ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఇక్కడ రెండో శాఖను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అనంతరం మార్గదర్శి ముఖ్యకార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ పాటూరి బ్రాంచ్ మేనేజర్ నిక్సన్‌కు కొత్త శాఖ మొదటి రశీదును అందించారు. ఈ కొత్త శాఖ ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్ తన ఖాతాదారులకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అధునాతన సాంకేతిక సేవలను అందించనుందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజర్లు, ఉద్యోగులు, అధిక సంఖ్యలో కస్టమర్లు హాజరయ్యారు.
మార్గదర్శి ప్రస్థానం : మార్గదర్శి చిట్ ఫండ్ 1962లో స్థాపించబడింది. ప్రస్తుతం సంస్థకు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 113 శాఖలు, 60 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో 114వ శాఖను ఏర్పాటు చేసి మార్గదర్శి ముందుకు సాగుతోంది. మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్ నేతృత్వంలో దిగ్విజయంగా ముందుకు సాగుతోన్న మార్గదర్శి వార్షిక టర్నోవర్ రూ.9,396 కోట్లు. వినియోగదారుల అవసరాలు, సౌకర్యాలకు అనుగుణంగా వివిధ రకాల చిట్ గ్రూపులను నిర్వహిస్తోంది.