ETV Bharat / state

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు - రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న 'కంట్రోల్ ఎస్' - CM REVANTH DAVOS INVESTMENT TOUR

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పలు కంపెనీలు - ఒప్పందం చేసుకున్న హెచ్‌సీఎల్‌ సంస్థ - ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన కంట్రోల్ ఎస్ సంస్థ

CM Revanth Reddy Davos Investment Tour
CM Revanth Reddy Davos Investment Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2025, 1:50 PM IST

CM Revanth Davos Investment Tour : రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో వరస భేటీలు, చర్చలు జరుపుతోంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ యూనిలీవర్, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. పామాయిల్ యూనిట్‌కు యూనిలీవర్, రాకెట్ తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు స్కైరూట్ మందుకొచ్చింది. జపాన్‌కు చెందిన ఎంటీసీ సానుకూలంగా స్పందించింది. గురువారం మధ్యాహ్నం వరకు దావోస్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెజాన్, సిఫీ టెక్నాలజీస్, సీఐఐ ప్రతినిధులతో చర్చలు జరపనుంది.

దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. మంగళవారం పలు కంపెనీల ప్రతినిధులుతో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ప్రముఖ బహుళ జాతి సంస్థ యూనిలీవర్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఆ కంపెనీ సీఈవో హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చెయిన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యూనిలీవర్ సంస్థ అంగీకరించింది.

స్కైరూట్ ఏరోస్పేస్‌తో ఎంవోయూ : రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ను ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్కైరూట్ ఏరోస్పేస్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన సమావేశమయ్యారు.

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ విజయం గర్వకారణమని సీఎం రేవంత్ ఆనందం వ్యక్తం చేశారు . తెలంగాణ యువకులు ప్రపంచస్థాయిలో ప్రతిభ ప్రదర్శించి రాష్ట్రంలోనే పెట్టుబడులకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. స్కైరూట్‌తో భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై ప్రభుత్వ వ్యూహాత్మక దృష్టిని చాటిచెబుతుందని సీఎం తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కమార్ అన్నారు.

తెలంగాణలో యూనిలివర్ పెట్టుబడులు - సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో పలు ఒప్పందాలు

తెలంగాణ పెవిలియన్‌లో ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ ఎజిలిటీ ఛైర్మన్ తారెక్ సుల్తాన్‌తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల ఆదాయం పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలపై చర్చించారు. కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సాంబనోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూ లేతో మంత్రి చర్చలు జరిపారు.

ఎంటీసీ గ్రూప్‌తో చర్చలు : రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో జపాన్‌కు చెందిన ఎంటీసీ గ్రూప్‌తో మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంటీసీ సానుకూలత వ్యక్తం చేసింది. ఎంటీసీకి భూమి, ఇతర సదుపాయాలు సమకూర్చేందుకు కసరత్తు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సౌదీఅరేబియాలోని జుబాలి, యెన్బూ రాయల్ కమిషన్ ప్రెసిడెంట్ ఖాలిద్ మొహమ్మద్ అల్ సలీంతో మంత్రి శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

మరిన్ని చర్చలు : అమెజాన్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చించనుంది. సీఐఐ సారథ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమవేశం కానున్నారు. దేశ, విదేశాలకు చెందిన సుమారు మూడు వేల మంది పాల్గొన్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తికి అందిస్తున్న ప్రోత్సాహకాలతో పాటు హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, డేటా సెంటర్లపై ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. గురువారం మధ్యాహ్నం వరకు దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. గురువారం మధ్యాహ్నం జురిచ్ నుంచి దుబాయ్ మీదుగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు.

జ్యురిచ్​లో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌ ప్రారంభించిన సీఎం రేవంత్ బృందం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.