Manchippa Village Opposing Manchippa Project Redesign : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద చెరువు సామర్థ్యం పెంచి సాగునీళ్లు ఇస్తానంది. రైతులు ఒప్పుకుని స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కింద అదే చెరువును ఎత్తును మరింత పెంచుతానంటే రైతులు వ్యతిరేకించి ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రాణహిత కింద 1.5టీఎంసీలు ఉన్న మోపాల్ మండలం మంచిప్ప చెరువును 3.5టీఎంసీలకు పెంచడం వల్ల తమ ప్రాంత ఉనికి కోల్పోవడంతో పాటు తమ భూములూ అధికంగా పోతున్నాయని అక్కడి రైతులు, ప్రజలు ఆందోళనలు చేశారు.
రిలే దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలూ అందజేశారు. అయినా ఎవ్వరూ స్పందించకపోగా ప్రాజెక్టు వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసి ఆ ప్రాంత రైతులు, ప్రజలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వమే కష్టాలను తెస్తోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
palamuru rangareddy project : బండరావి'పాకులాట ఇంకెన్నాళ్లు'.. పరిహారం వచ్చేదెన్నడు..?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20, 21, 22 ప్యాకేజీ పనులను చేపట్టారు. ఎస్సారెస్పీ వెనుక జలాలపై ఆధారంగా నిర్మిస్తోన్న ఈ ప్యాకేజీ పనులతో ఉమ్మడి జిల్లాలో అదనంగా సుమారు 2లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇదే ప్రతిపాదన ప్రాణాహిత-చేవెళ్ల కింద ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్యాకేజీలను కాళేశ్వరం ప్రాజెక్టు కిందకు తెచ్చారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప, కొండెం చెరువును 3.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్‌గా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. మంచిప్పను 3.5 టీఎంసీలకు పెంచితే అమ్రాబాద్, బైరాపూర్, మంచిప్ప గ్రామాల పరిధిలో వందల ఎకరాలు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబాలని భూములు పోతే దిక్కులేని స్థితికి చేరుతామని వాపోయారు.
హామీ ఇచ్చారంటూ సీఎంకు గుర్తు చేస్తున్న ప్రజలు: గత ఎన్నికలకు ముందు వరకు మంచిప్ప ముంపు ప్రాంత ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన భూపతిరెడ్డి మంచిప్ప వాసులకు మద్దతు ప్రకటించారు. అలాగే పాదయాత్ర చేస్తూ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి సైతం మంచిప్పలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత డిజైన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. దీంతో మంచిప్ప వాసులు అప్పుడు ఇచ్చిన హామీని సీఎంకు గుర్తు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.
దయనీయంగా మారిన ముంపు బాధితుల బతుకులు - కొత్త ప్రభుత్వంపైనే కోటి ఆశలు
ఇళ్లకే కాదు వాకిళ్లు, ఖాళీ స్థలాలకు పరిహారం ఇవ్వాలి.. ఉదండపూర్ నిర్వాసితుల డిమాండ్