ETV Bharat / state

నగల వ్యాపారికి ఘరానా మోసగాడు టోకరా - చెల్లని చెక్కులు ఇచ్చి ఆభరణాలతో పరార్​ - Man who cheated jeweller In HYD

Man who cheated Jeweller : లక్షలాది రూపాయల విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసి చెల్లని చెక్కులు ఇచ్చి వజ్రాభరణాలతో ఉడాయించాడు ఓ ఘరానా కేటుగాడు.హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించిన నగల షాపు యజమాని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Man who cheated Jeweller
Man who cheated Jeweller (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 8:45 PM IST

Man Who Cheated Jeweller In Hyderabad : మెడలో గొలుసు, వేళ్లకు ఉంగరాలు, చేతికి బ్రాస్​లెట్​ ధరించి సంపన్నవంతుడిగా కనిపిస్తాడు. బీఎండబ్ల్యూ కారులో స్టైల్​గా దుకాణానికి వస్తాడు. టిప్​టాప్​గా షాపులోకి ప్రవేశించి బంగారం వ్యాపారితో పరిచయం పెంచుకుంటాడు. తనకు విల్లాలు ఉన్నాయని, కోటీశ్వరుడినని చెప్పి వ్యాపారులను బుట్టలో వేసుకుని లక్షల ఖరీదు చేసే డైమండ్ నగలు ఎంపిక చేసి దానికి తగిన నకిలీ చెక్కు ఇచ్చి అక్కడి నుంచి జారుకుంటాడు. తమని మోసగించాడు అని షాపు వారు తెలుసుకునేంతలోనే అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటే పొరపాటే ఇది యదార్థ గాథ.

ఇదీ జరిగింది : జూబ్లీహిల్స్​ రోడ్​నెంబర్​-36లోని ఓ ఆభరణాల దుకాణానికి గత జూన్​ 20వ తేదీన సుమన్​ గుంటి అనే వ్యక్తి వచ్చి రూ.4.12 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించి చెక్కు ఇచ్చి పసిడి ఆభరణాలను తీసుకువెళ్లాడు. ఆభరణాల వ్యాపారి అజుగుప్తా ఆ చెక్కును విత్​డ్రా చేసేందుకు బ్యాంకులో వేయగా అకౌంట్​ బ్లాక్​లో ఉందని వారు తిరిగి పంపించారు.

దీంతో వ్యాపారి నిందితుడికి ఫోన్​ చేశాడు. రెండు రోజుల్లో డబ్బులు పంపిస్తానని సదరు వ్యక్తి చెప్పడంతో ఉద్దేశపూర్వకంగానే ఈ మోసానికి పాల్పడినట్లుగా గుర్తించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు సుమన్​ గుంటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చెల్లని చెక్కులు ఇచ్చి మోసగిస్తూ : చెల్లని చెక్కులు ఇచ్చి బంగారు వర్తకులను మోసగిస్తూ లక్షలాది రూపాయలు విలువ చేసే వజ్రాభరణాలతో ఉడాయించిన ఘరానా కేటుగాడు సుమన్ గుంటిపై ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో కూడా చీటింగ్ కేసు నమోదైంది. రోడ్డునెంబ ర్-2లోని లుంబినీమాల్​లో ఉన్న తివారుమల్ నగల షాపు వ్యాపారి సందీప్ అగర్వాల్​ను మోసగించి పెద్ద ఎత్తున నగలతో జారుకున్నాడు.

ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్​స్టేషన్లో కేసు నమోదైంది. అంతటితో ఆగకుండా బంగారం షాప్​లలో ఖరీదైన వజ్రాభరణాలను డోర్ డెలివరీ చేయించుకుని నకిలీ చెక్కులు ఇచ్చి మోసగిస్తున్నాడు సుమన్ గుంటి. అతడు ఇప్పటికే నార్సింగి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్​స్టేషన్ల పరిధిలో రూ.2 కోట్లకు పైగా నగలు కొట్టేశాడు. వజ్రాల హారాలు, బంగారు గాజులు కొట్టేస్తుంటాడు.

ఈజీమనీ కోసం అలవాటుపడి : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాల గూడకు చెందిన గుంటి సుమన్ (43) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో ఈజీ మనీ కోసం అలవాటుపడ్డాడు. సినిమా తీస్తున్నానని పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇస్తానని ఓ మహిళ చెప్పడంతో డబ్బు కోసం బంగారు దుకాణదారులను మోసగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ప్రముఖ ఆభరణాల దుకాణాల ఫోన్ నెంబర్లు తీసుకుని ఇటీవల మార్కెట్లోకి వచ్చిన నగల డిజైన్లు కావాలని చెప్పి నగలను ఇంటికి రప్పించుకోవడం నైజంగా పెట్టుకున్నాడు. ఇలా నగరంలోని పలు దుకాణాల నుంచి ఆభరణాలు కొట్టేశాడు. ఇటీవలనే రాజేంద్రనగర్ ఎస్ఓటీ, నార్సింగి పోలీసులకు కూడా చిక్కాడు. సుమన్​పై ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 14 చీటింగ్ కేసులు నమోదు కాగా తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

కన్నేస్తాడు - గెటప్​ మార్చేస్తాడు - ఆపై కొట్టేస్తాడు - తర్వాత ఎంచక్కా! - Gold theft in hyderabad

ప్రైవేట్‌ ట్రావెల్ బస్సులో 4 కిలోల బంగారం తరలింపు - స్వాధీనం చేసుకున్న సంగారెడ్డి పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.