Man killed Seven Years Girl in Hyderabad : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటగూడ గ్రామానికి చెందిన మిశ్రమ్ ప్రభాకర్ బతుకుదెరువు కోసం ఏడు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. కూలీ పనులు చేసుకునే ప్రభాకర్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు. ప్రభాకర్‌కు తన ప్రాంతానికే చెందిన కూలీ పనులు చేసుకునే తిరుపతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ప్రభాకర్ ఇంట్లో తరచూ మద్యం తాగేవాళ్లు. ఈ క్రమంలో తిరుపతి ప్రభాకర్ భార్య మీద కన్నేశాడు. ప్రభాకర్, ఇద్దరు పిల్లల అడ్డు తొలగించుకుంటే ఆమెను సొంతం చేసుకోవచ్చని పథకం వేశాడు. అప్పటికే ప్రభాకర్ పెద్దకుమార్తెతో చనువుగా ఉంటూ ద్విచక్రవాహనం మీద తిప్పేవాడు.
ఈ నెల 12న పాపను ద్విచక్రవాహనంపై తన ఇంటికి తీసుకెళ్లి సాయంత్రం 3 గంటలకు మళ్లీ ప్రభాకర్ ఇంటిదగ్గర వదిలేశాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర ఎవరూ లేని సమయం చూసి సాయంత్రం 5 గంటల సమయంలో బాలికను అపహరించాడు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి గుండ్లపోచంపల్లి సమీపంలో బాసరేగడి గ్రామం వద్దకు తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు. బాలిక మరణించినట్లు నిర్ధరించుకున్నాక గోనె సంచిలో మూటకట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. బాలికను తిరుపతి అపహరించిన విషయం తెలియని ప్రభాకర్, అతడి భార్య సమీప ప్రాంతాల్లో వెతికారు.
'ఈ నెల 12న రాత్రి 2 గంటలకు ఏడేళ్ల బాలిక కనిపించడంలేదని ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలను పరిశీలించాం. దీని ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాం'-శ్రీనివాస్‌రెడ్డి, మేడ్చల్ ఏసీపీ
నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు : ఎంత వెతికినా ఆచూకీ లేకపోవడంతో సూరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభాకర్ నివాసముంటున్న ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలికను తిరుపతి తీసుకెళ్లినట్లు గుర్తించారు. హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన తిరుపతి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే హత్యకు గురైన బాలిక తల్లి భర్త మరణించడంతో ప్రభాకర్‌తో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్‌కు ఇప్పటికే వివాహమై పిల్లలుండగా వారిని వదిలేసి వివాహిత, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి సూరారంలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.
మహిళను హత్య చేసి - మర్డర్‌ను రేప్ సీన్‌గా మార్చి - కటకటాల్లోకి కి'లేడీ' - Kukatpally Murder Case