ETV Bharat / state

వేడుకల వేళ విషాదం : తలలోంచి బాణాసంచా దూసుకెళ్లి వ్యక్తి మృతి - MAN DIES AFTER FIREWORK HITS HEAD

నూతన సంవత్సర వేడుకలో అపశృతి - బాణసంచా కాల్చుతుండగా తలలోకి దూసుకెళ్లిన మందుగుండు - విశాఖపట్నం నగరంలో జరిగిన ఘటన

Man dies After Firework Hits Head
Man dies After Firework Hits Head (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 10:36 AM IST

Man dies After Firework Hits Head : నూతన సంవత్సర వేడుకల్లో బాణాసంచా కాల్చుతుండగా మందుగుండు వ్యక్తి కళ్లను చీల్చుకుంటూ తలలోకి దూసుకెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం జిల్లాలో జరిగింది. దీంతో ఆ కుటుంబం న్యూ ఇయర్​ వేళ దుఃఖంలో మునిగిపోయింది. బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ నగర పరిధి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జీవీఎంసీ 87వ వార్డు ఉక్కు నిర్వాసిత రజక వీధిలో సుద్ధమల శివ భార్య ధనలక్ష్మి, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి న్యూ ఇయర్​ వేడుకల్లో భాగంగా తన ఇంటి మేడపై కుటుంబంతో శివ ఉత్సాహంగా గడిపారు. అప్పటి వరకూ అంతా సరదాగా ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉన్నారు. రాత్రి 12 గంటల సమయంలో కొత్త సంవత్సరం రావడంతో న్యూ ఇయర్​ విషెస్​ చెప్పుకుంటూ కేక్​ కట్​ చేసి మిఠాయిలు పంచుకున్నారు.

Man dies After Firework Hits Head
మృతుడు సుద్ధమల శివ (ETV Bharat)

కళ్లలోకి దూసుకెళ్లిన బాణసంచా : అనంతరం బాణాసంచా (గన్​షాట్​) కాల్చుతుండగా అవి సక్రమంగా పేలలేదు. నిప్పు అంటుకుందో లేదోనని చూడడానికి వాటి దగ్గరకు వెళ్లాడు. ఇలా వెళ్లి చూడగానే ఒక్కసారిగా పేలి రెండు కళ్లను చీల్చుకుంటూ తలలోకి బాణాసంచా దూసుకుపోయింది. దీంతో ఆయన సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో న్యూ ఇయర్​ వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడు స్టీల్ ​ప్లాంటులో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నట్లు సమాచారం.

స్నేహితురాలు విసెస్​ చెప్పలేదని యువతి ఆత్మహత్య : అనంతపురం నగర శివారులో ఉన్న ఓ ప్రైవేటు జూనియర్​ కాలేజీలో ఓ విద్యార్థిని స్నేహితురాలు న్యూ ఇయర్​ విసెస్​ చెప్పలేదని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయిన అమ్మాయి ఇంటర్​ రెండో సంవత్సరం చదువుతోంది. ఆ యువతికి ఇంటర్​ మొదటి సంవత్సరం విద్యార్థినితో స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ సన్నిహితంగానే ఉంటూ చదువుకునేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి న్యూ ఇయర్​ వేళ మొదటి ఏడాది విద్యార్థిని రెండో ఏడాది విద్యార్థినికి న్యూ ఇయర్​ విషెస్​ చెప్పలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై, బుధవారం తెల్లవారుజామున వంట గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

హాస్టల్​లో న్యూ ఇయర్ వేడుకలు - ఫ్రెండ్ విష్ చేయలేదని విద్యార్థిని ఆత్మహత్య

ఆస్తి వివాదం - కేసు పెట్టాడని కిరాతకంగా హత్య చేసిన సోదరులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.