ETV Bharat / state

కేబినెట్​లోకి గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇద్దరు నేతలు! - రేసులో మల్‌రెడ్డి, దానం - Telangana Cabinet Expansion

Telangana Cabinet Expansion : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచి ఒక్కరికి అవకాశం కల్పించలేదు. అయితే, ఈ సారి మాత్రం ఈ జిల్లాల నుంచి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా దానం నాగేందర్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Hyderabad Leader in Cabinet Expansion
Hyderabad Leader in Cabinet Expansion (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 8:56 AM IST

Hyderabad Leaders Names in Cabinet Expansion : త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రాజధానికి ప్రాతినిధ్యం లభించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ వర్గాలు సైతం ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచి మంత్రివర్గంలో స్థానం లభించలేదు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలలో రేవంత్‌రెడ్డి కేబినెట్​లో వీరెవరికి చోటు దక్కలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈనేపథ్యంలో ఒకరికి స్థానం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 29 స్థానాలు ఉండగా, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, షాద్‌నగర్‌ నుంచి వీర్ల శంకర్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నార్యాయణరెడ్డి మాత్రమే గెలుపొందారు. వీరిలో వీర్లపల్లి శంకర్, నారాయణరెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యారు. మల్‌రెడ్డి మాత్రం మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. దీంతో పార్టీలో తానే సీనియర్‌ కాబట్టి తనకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఇదే విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సైతం కలిశారు. దిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలను కూడా రెండు మూడుసార్లు కలిశారు.

త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ - వారికి ఛాన్స్ దక్కుతుందా?

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, కాంగ్రెస్‌లో చేరే సమయంలో, ఒకవేళ ఎంపీగా ఓడిపోతే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. దీంతో తనకు మంత్రివర్గంలో తప్పక స్థానం లభిస్తుందన్న ఆశలో దానం నాగేందర్ ఉన్నారు.

కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే స్థానం కల్పించాలని అధిష్ఠానం నిర్ణయించిందంటూ, వారం కిందట దిల్లీలో రేవంత్‌ రెడ్డి విలేకరులకు వెల్లడించారు. దీంతో దానం ఆశలు సన్నగిల్లినట్లైంది. అయినప్పటికీ దానం తన ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నగరంలో మైనార్టీలకు మొదటి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మైనార్టీలు గెలవలేదు. ఈసారి ఆ వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి తద్వారా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా అనే దానిపై స్పష్టత రాలేదు. ఒకవేళ మైనార్టీలకు అవకాశం కల్పిస్తే మాజీ మంత్రి షబ్బీర్ అలీ లేదా ఫిరోజ్ ఖాన్​లకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అధిష్ఠానంతో సీఎం రేవంత్​ కీలక భేటీ - కేబినెట్ విస్తరణపై ప్రధానంగా చర్చ - TG congress meet in delhi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.