ETV Bharat / state

రేపే పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్​ కుమార్‌ గౌడ్‌ - సీఎం రేవంత్​ నుంచి బాధ్యతల స్వీకరణ - New PCC President Charge Taking - NEW PCC PRESIDENT CHARGE TAKING

Mahesh will Take Charge as PCC President : రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా రేపు మహేశ్​ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నుంచి మహేశ్​ కుమార్‌ గౌడ్‌ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఏఐసీసీ నాయకులు, మంత్రులు, దీపాదాస్‌ మున్షీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటుకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చర్యలు తీసుకుంటున్నారు.

Mahesh Kumar Goud will Take Charge as PCC President
Mahesh will Take Charge as PCC President (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 9:16 AM IST

Updated : Sep 14, 2024, 9:30 AM IST

Mahesh Kumar Goud will Take Charge as PCC President : రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నూతన అధ్యక్షుడుగా బొమ్మ మహేశ్​ కుమార్‌ గౌడ్‌ రేపు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు గాంధీ భవన్‌ ముస్తాబవుతోంది. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దాదాపు 5 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి వస్తారని పార్టీ అంచనా వేస్తుండడంతో ఆ మేరకు పోలీసు శాఖ కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గాంధీభవన్‌లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మరొకవైపు శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ పరంగా ముందస్తు చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పదవీ బాధ్యతలు తీసుకునే సమయంలో ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు గురించి చర్చించారు. గన్​పార్క్‌ దగ్గర నుంచి గాంధీభవన్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా ఏ విధంగా ర్యాలీని గాంధీభవన్‌ వరకు వచ్చేట్లు చూడాలనే తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు : రేపు మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు మహేశ్​కుమార్‌ గౌడ్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గన్​పార్క్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఒంటిగంటకు బయలు దేరి గాంధీభవన్‌ వరకు ర్యాలీగా వస్తారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్​రెడ్డి గాంధీభవన్‌ చేరుకుంటారు. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సీఎం రేవంత్​రెడ్డి నుంచి కొత్తగా నియామకమైన పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.

పూజ తర్వాత గాంధీభవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభల పాల్గొంటారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న స్టేజీ యాభై నుంచి 60 మంది వరకు కూర్చొనేందుకు వీలుగా ఉంటుంది. స్టేజి వద్ద 500 మంది వరకు ముఖ్యులు కూర్చొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా గాంధీభవన్‌ ప్రాంగణంలో పెద్ద ఎత్తున తరలివచ్చే జనం వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. నూతన పీసీసీ అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు గాంధీభవన్‌ సుందరంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే భవన్‌ మొత్తానికి రంగులు వేసే కార్యక్రమం దాదాపు పూర్తయ్యింది. పాత ఫర్నీచర్‌ మరమ్మతులు చేయించడం, కొత్తగా ఫర్నీచర్‌ ఏర్పాటు చేస్తున్నారు.

గాంధీభవన్​లో వాస్తు మార్పులు : ఇందిరాభవన్‌, గాంధీభవన్‌ మధ్య ఖాళీగా ఉన్న స్థానంలో సమావేశ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. దీని పక్కన ఉన్న గాంధీభవన్‌ ప్రహరీ గోడ వర్షాలకు కూలిపోవడంతో తిరిగి నిర్మాణం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వాస్తు మార్పులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే గాంధీభవన్‌లోకి వచ్చేందుకు రెండు గేట్లు ఉన్నాయి. ఇప్పుడు మరో గేటు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అటు ఇందిరా భవన్‌, ఇటు గాంధీభవన్‌ మధ్య మరొక గేటు ఏర్పాటు చేయడంతో సీఎం లాంటి ముఖ్యులు ఎవరైనా రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. వీవీఐపీలు వచ్చినప్పుడే ఆ గేటు తెరిచేట్లు నిర్ణయించారు.

NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి పీసీసీ పీఠం వరకు - మహేశ్‌కుమార్‌ గౌడ్‌ రాజకీయ ప్రస్థానమిదే - PCC President Mahesh Kumar Goud

Last Updated : Sep 14, 2024, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.