ETV Bharat / state

సినీఫక్కీలో బస్సులో చోరీ - పోలీసులు ఈ కేసు ఎలా ఛేదించారంటే? - JADCHERLA BUS THEFT CASE SOLVED

Jadcherla Bus Theft Case Update : సోదరికి డబ్బులు ఇవ్వడానికి సంచిలో రూ. 36లక్షలు పెట్టుకుని బయలు దేరాడు ఆ ప్రయాణికుడు. హైదరాబాద్​లో బస్కెక్కాడు. మార్గం మధ్యలో అల్పాహారం కోసం బస్సు ఆగగా సంచిలో డబ్బులున్నాయో లేదోనని ఒకసారి చెక్ చేసుకున్నాడు. తీరా చూస్తే అందులో డబ్బుల్లేవు. దానికి బదులు వాటర్ బాటిళ్లున్నాయి. వెంటనే సమీప పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సవాల్​గా తీసుకున్న పోలీసులు కేవలం రెండువారాల వ్యవధిలో మెగా చోరిని ఛేదించారు.

Thieves Robbed 36 Lakhs
Thieves Robbed 36 Lakhs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 9:40 AM IST

Updated : Jul 31, 2024, 10:02 AM IST

Thieves Robbed 36 Lakhs From RTC Bus : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఆర్టీసీ బస్సులో రూ. 36 లక్షల భారీ చోరీ కేసును పోలీసులు కేవలం రెండు వారాల్లో ఛేదించారు. హైదరాబాద్‌ మోతీనగర్‌కు చెందిన ట్రాన్స్‌కో ఉద్యోగి పాలచెర్ల దామోదర్‌ కర్నూలులో ఉండే సోదరి భాగ్యలక్ష్మికి డబ్బులు అవసరం ఉండటంతో, తన పీఎఫ్, ఇతర ఖాతాల నుంచి నగదు తీసుకున్నారు. ఈనెల 16వ తేదీన 36 లక్షల నగదు సంచిలో పెట్టుకుని కర్నూలు బయలుదేరారు. ఎంజీబీఎస్‌లో ఉదయం ఏడు గంటల 45 నిమిషాలకు బయలుదేరి, 9 గంటల 20 నిమిషాలకు జడ్చర్ల బస్టాండుకు చేరుకున్నారు. అక్కడ బ్యాగును పరిశీలిస్తే డబ్బు కనిపించలేదు. నగదు స్థానంలో నీళ్ల బాటిళ్లున్నాయి.

రైతు ఇంట్లో వీఆర్​ఏ చోరీ - సర్కార్ ఉద్యోగిని దొంగను చేసిన ఆన్​లైన్ గేమ్స్ - VRA STOLE 2 LAKHS FROM FARMER

Jadcherla Bus Theft Case Update : దామోదర్‌ వెంటనే బాధితుడు జడ్చర్ల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. భారీ చోరీ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. దొంగతనం జరిగిన రోజు బస్సులో సీసీ కెమెరాలను పరిశీలించగా, అవి పని చేయకపోవడంతో దృశ్యాలు నమోదు కాలేదు. జడ్చర్ల బస్టాండులోని సీసీ కెమెరాలను పరిశీలించినా నిందితుల జాడ తెలియలేదు. జడ్చర్లలోని జాతీయ రహదారి పైవంతెన వద్ద కూడలిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.

బాధితుడు వచ్చిన బస్సులోనే వచ్చిన ఇద్దరు అనుమానితులు బస్టాండు రాకముందే దిగిపోయినట్లు గుర్తించారు. వారిపై అనుమానంతో హైదరాబాద్‌ ఎంజీబీఎస్ లోని సీసీ కెమెరాలు పరిశీలించగా అక్కడ నిందితుల కదలికలు, బస్సులో ఎక్కిన దృశ్యాలు నమోదయ్యాయి. నిందితులు ఎవరు? జడ్చర్ల నుంచి ఎక్కడికి వెళ్లారు.? అనే కోణంలో పోలీసులు రెండు వారాలు గాలించి ఎట్టకేలకు అదుపులోకి వారిని అరెస్టు చేశారు.

నిందితుల్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు, బిజ్నూరు సీజేఎం కోర్టులో ప్రవేశపెట్టి.. ట్రాన్సిట్ వారెంట్‌తో జడ్చర్లకు తీసుకువచ్చారు. మొత్తం కేసును ఛేదించడంలో సీసీటీవీ దృశ్యాలే కీలకభూమిక పోషించాయి. అందుకే ప్రజలు కమ్యూనిటీ సీసీటీవీల ఏర్పాటుకు ముందుకు రావాలని ఎస్పీ జానకి విజ్ఞప్తి చేశారు. స్వల్ప వ్యవధిలోనే నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందికి ఎస్పీ జానకి రివార్డులు ప్రకటించారు.

దృష్టి మరల్చారు.. పదితులాలు పట్టుకెళ్లారు.

Last Updated : Jul 31, 2024, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.