ETV Bharat / state

మా అసోసియేషన్ కీలక నిర్ణయం - సినీ నటి హేమ సస్పెండ్​! - Maa Association Suspend Hema - MAA ASSOCIATION SUSPEND HEMA

Maa Association Suspends Movie Actress Hema : బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టైన సినీనటి హేమపై మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ కఠిన చర్యలు తీసుకోనుంది. ఆమెను మా అసోసియేషన్​ నుంచి సస్పెండ్​ చేసేందుకు సంస్థ అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Manchu Vishnu Reaction on Hema
Maa Association Suspend Movie Star Hema (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 8:01 PM IST

Maa Association Suspends Movie Actress Hema : బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టైన సినీనటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఈ మేరకు హేమను సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె సభ్యత్వాన్ని కూడా శాశ్వతంగా రద్దు చేయాలని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా హేమ ఉదంతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై స్పందించిన మంచు విష్ణు గత నెల 25న ఎక్స్​లో పోస్టు చేస్తూ హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు.

Manchu Vishnu Reaction on Drug Case : మా అసోసియేషన్ అధ్యక్షుడు హేమపై వచ్చిన ఆరోపణలను ఖండించిన తర్వాత ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్​ చేశారు. దీంతో మరోసారి ఇవాళ ఆమె విషయంలో మా అసోసియేషన్​లో చర్చకు దారితీసింది. కార్యవర్గ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అధ్యక్షుడు అందరికీ వాట్సప్ గ్రూప్​లో సందేశాలు పంపించారు. దీనికి స్పందించిన సభ్యుల్లో ఎక్కువ మంది సస్పెండ్ చేయాలని తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారి నిర్ణయాన్ని ఏకీభవిస్తూ డ్రగ్స్ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు సస్పెండ్ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరు రేవ్​ పార్టీ కేసు - రెండోసారి నటి హేమకు నోటీసులు - second time notice to actress hema

Bangalore Drug Case : హేమ డ్రగ్స్ విషయం చిత్ర పరిశ్రమ పరువు ప్రతిష్ఠలకు సంబంధించి కావడంతో కఠినంగానే మంచు విష్ణు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గురువారం ఈ విషయంపై మా అసోసియేషన్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

గత నెల 20వ తేదీ రాత్రి బెంగళూరు శివార్లలోని హెబ్బగోడి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని జీఆర్​ ఫామ్​ హౌస్​లో రేవ్​ పార్టీ జరిగింది. పోలీసులు తెలుసుకుని దాడి చేయగా 103 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మే 25న నటి హేమను విచారణకు రావాలని పోలీసులు నోటిసులు పంపించారు. ఆమె నిరాకరించింది. రెండో సారి మే 29న జూన్​ 1న విచారణకు రావాలని నోటీసులు పంపించింది. అప్పుడు కూడా ఆమె వెళ్లలేదు. జూన్​ 3న మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ జరపారు. అనంతరం ఆమెను అరెస్టు చేశారు. న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది.

రేవుపార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్- 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ - HEMA ARREST IN RAVE PARTY CASE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.