ETV Bharat / state

జాబ్ క్యాలెండర్​పై ఎన్నో సందేహాలు - పరీక్షల షెడ్యూల్​పై అయోమయం - TELANGANA JOB CALENDAR 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 7:58 AM IST

Updated : Aug 4, 2024, 10:03 AM IST

Telangana Job Calendar Exams Schedule Issue : తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్​లో పలు లోపాలు కనిపిస్తున్నాయి. ఒకే కేటగిరి కలిగిన పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తారా? లేదా, ఒకే రకమైన పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉంటుందా? అనే అంశంపై స్పష్టత కరవైంది. ఆయా పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

Job Calendar Issues
Job Calendar Issues (ETV Bharat)

Dates Issues in Telangana Govt Job Calendar 2024 : కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం రోజున అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రభుత్వ కొలువులకు సిద్ధమయ్యేలా జాబ్ క్యాలెండర్ రూపొందించినప్పటికీ, అందులో కొన్ని పరీక్షల షెడ్యూలు అభ్యర్థులకు ఇబ్బందిగా మారనున్నాయి. ఒకే రకమైన విద్యార్హతలు, ఒకటే కేటగిరీ పోస్టులకు వేర్వేరు నియామక సంస్థలు ఒకే సమయంలో వేరువేరుగా ప్రకటనలు వెలువరించనున్నాయి. దీనివల్ల పరీక్షలకు మధ్య స్వల్ప వ్యవధి ఉండటం సమస్యగా మారనుంది.

ఒకే కేటగిరి కలిగిన పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తారా? ఒకేరకమైన పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉంటుందా లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కొన్ని నోటిఫికేషన్లకు ఉద్యోగ ప్రకటన జారీ, దరఖాస్తు స్వీకరణ, పరీక్షకు ఇచ్చే గడువు చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్‌లో కొన్ని నోటిఫికేషన్ల షెడ్యూలుపై పలు సందేహాలపై ఈటీవీ భారత్ ప్రత్యక కథనం.

వైద్య ఆరోగ్య నియామకాలు : వైద్య ఆరోగ్యశాఖలో నర్సింగ్‌ అధికారులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులకు ఈ ఏడాది సెప్టెంబరులో వైద్య ఆరోగ్య నియామకాల బోర్డు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ప్రకటన జారీ వెలువరించనుంది. ఉద్యోగ ప్రకటన వెల్లడైన అనంతరం దరఖాస్తులు స్వీకరించడానికి కనీసం 15 నుంచి 30 రోజుల గడువు ఉంటుంది. ఆ తర్వాత రాతపరీక్షకు కనీసం 45 రోజుల నుంచి మూడు నెలల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు 2024 నవంబరులో పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కనీస గడువు లభిస్తుందా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

గ్రూప్‌-3 ఉద్యోగం : 2022లో జారీ చేసిన గ్రూప్‌-3 ఉద్యోగ ప్రకటనకు సంబంధించి నవంబరు 17, 18 తేదీల్లో రాతపరీక్షలు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు కనీస అర్హత డిగ్రీగా పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులు ఏదైనా ఓ పరీక్షకు దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. డిసెంబరు నెలలోనే గ్రూప్‌-2 రాతపరీక్షల షెడ్యూలు కూడా ఉంది.

"2 పేపర్లపై ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చి - జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు" - BRS Protest Against On Job Calendar

ఇంజినీరింగ్‌ ఉద్యోగాల్లో : ఇంజినీరింగ్‌ డిగ్రీ అర్హతతో విద్యుత్తు సంస్థలు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ సర్వీసుల్లో ఏఈ, ఏఈఈ, సబ్‌ఇంజినీర్‌ తదితర పోస్టులకు 2024 అక్టోబరులోనే ఉద్యోగ ప్రకటనలు వెలువడనునన్నాయి. ఇందుకు సంబంధించి జనవరిలో రాతపరీక్షలు నిర్వహించేలా విద్యుత్తు సంస్థల ఉద్యోగాలకు ట్రాన్స్‌కో, ప్రభుత్వ విభాగాల్లో ఇంజినీరింగ్‌ సర్వీసులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వేర్వేరుగా ప్రకటనలు జారీ చేస్తాయి. ఈ రెండు ప్రకటనల్లోనూ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో పోస్టులు ఉంటాయి. ఈ పరీక్షలను ఆయా నియామక సంస్థలు వేర్వేరుగా పెడతాయా? లేదా ఉమ్మడిగా నిర్వహిస్తాయా? అనే అంశంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.

కళాశాలల్లో లెక్చరర్లు : ప్రభుత్వ డిగ్రీ, గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఇతర ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్​లో పేర్కొన్నారు. వీటికి వచ్చేఏడాది జూన్‌లో ఉద్యోగ ప్రకటనలు వెలువరించనున్నారు. టీజీపీఎస్సీ, గురుకుల నియామక బోర్డులు వేర్వేరుగా జారీ చేయనున్నాయి. ఒకే విద్యార్హత ఉన్న పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

డీఎస్సీ ప్రకటన : పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఇచ్చిన షెడ్యూలులో ప్రకటన, దరఖాస్తు, పరీక్షలకు మధ్య కనీస సమయంలో సైతం ఇబ్బందులు రానున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ ఉద్యోగ ప్రకటన రానుంది. అయితే, ఏప్రిల్‌లో పరీక్షలని ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలోనే డిగ్రీ, పీజీ అర్హతలతో గెజిటెడ్‌ స్థాయి అధికారుల నోటిఫికేషన్‌లో పరీక్షల షెడ్యూలు విడుదల చేశారు. ఈ రెండింటి మధ్య గడువు సమస్య నెలకొననుంది.

సింగరేణిలో : గ్రూప్‌-3 పోస్టులకు 2025 జులైలో నోటిఫికేషన్‌రానుంది. దీనికి ఏదైనా డిగ్రీ అర్హతగా పేర్కొన్నారు. అదే సమయంలో సింగరేణిలో బీఈ, బీటెక్, ఇతర అర్హతలతో కూడిన ఉద్యోగ ప్రకటన జారీ కానుంది. ఈ రెండింటి పరీక్షల షెడ్యూలు 2025 నవంబరు. వీటి మధ్య వ్యవధి లేకుంటే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో జాబ్​ క్యాలెండర్​ విడుదల - ఏ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయంటే? - Telangana Job Calendar 2024

Last Updated : Aug 4, 2024, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.