ETV Bharat / state

లోన్ యాప్​ల ఉచ్చులో పడకండి - జీవితాన్ని ఆగం చేసుకోకండి - Loan App Harassments in telangana

Loan App Harassments in Telangana : లోన్​యాప్​ల నిర్వాహకుల ఆగడాలకు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. తక్షణ రుణాల పేరుతో సెల్​ఫోన్​లకు మెసేజ్​లు పంపిస్తూ తీసుకున్నాక అధిక వడ్డీలు వసూలు చేస్తూ పీల్చిపిప్పి చేస్తున్నారు. లోన్​యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు ఈ లోన్ యాప్​లతో ఏవిధంగా మోసాలకు పాల్పడుతున్నారు? వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Loan App Harassments in Telangana
Loan App Harassments in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 3:55 PM IST

Loan App Harassments in Telangana : క్షణాల్లో లోన్​ను పొందొచ్చని సెల్​ఫోన్​కు సాధారణ సందేశం ద్వారా లేదా వాట్సాప్​నకు సమాచారం పంపించి ఆశ చూపిస్తారు. ఒక్క లింక్​ను క్లిక్ చేస్తే చాలు ఎలాంటి ఫ్రూప్​లు లేకుండా తక్షణమే రుణం వస్తుందంటారు. ఆ లింక్​పై క్లిక్ చేశారా ఇక అంతే సంగతులు. వారి ఉచ్చులో పడినట్లే. చేతికొచ్చిన నగదు ఖర్చయ్యేలోపే యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్ల మోత మోగుతుంది. వారం రోజులు తిరిగేలోపు మీరు తీసుకున్న లోన్​కు ఇంత వడ్డీ అని ఫోన్లు చేస్తారు. చెల్లిస్తామని చెప్పినా ఆ కాల్స్ మాత్రం ఆగవు. ఒకరి తరవాత వేరొకరు ఫోన్‌ చేస్తూనే ఉంటారు. అసభ్యకరంగా, దురుసుగా మాట్లాడతారు. మళ్లీ ఆ నంబరుకు కాల్‌ చేస్తే కనెక్ట్ అవ్వదు. రోజూ కొత్త కొత్త నంబర్లతో తిప్పలు ఇంతకింతకు పెరుగుతాయి. బాధను భరించలేక ఒక వేళ కొంత మొత్తం చెల్లించినా మళ్లీ అదే కథ!

అధిక వడ్డీలకు : లోన్ యాప్‌ల వడ్డీ అడ్డూ అదుపు లేకుండా ఉంటుంది. రూ.7 వేలు తీసుకున్న బాధితుడికి పది రోజుల్లోనే రూ.12 వేలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తారు. అసలుకన్నా వడ్డీ దాదాపుగా రెట్టింపు వసూలు చేస్తారు. వాస్తవానికి జాతీయ బ్యాంకులతో పాటు ఇతర కార్పొరేట్‌ బ్యాంక్‌లు సిబిల్‌ స్కోర్‌ను బట్టి 8 శాతం నుంచి 14శాతం వడ్డీతో లోన్​ను అందిస్తాయి. పక్కాగా కిస్తీలు(ఈఎంఐ) చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. వాటిని కాదని ఒక్కసారి ఈ రుణ యాప్‌ ముగ్గులోకి దిగితే మాత్రం బయటపడటం కష్టమే!

లోన్​యాప్​ల నిర్వాహకుల వేధింపులు : లోన్​యాప్​ల దారుణానికి కరీంనగర్‌కు చెందిన సతీశ్‌ రెడ్డి గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఆయన సెల్​ఫోన్​కు రుణయాప్‌ల నిర్వాహకుల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. జనరల్‌ ఆస్పత్రిలో మరణోత్తర పరీక్షల(శవపరీక్షల) కోసం వేచి ఉన్న అతని బంధువులు ‘మీ బాధ తాళలేక సతీశ్‌ చనిపోయాడని చెప్పినప్పటికీ అదంతా తమకు తెలియదు పైసలు కట్టాలి అని హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరకు మృతదేహం ఫొటోలను పంపించినా వారి బెదిరింపుల ఫోన్‌ కాల్స్‌ ఆగలేదంటే వారి ఆగడాలు, వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

వికృత చేష్టలకు అడ్డూ అదుపూ ఉండదు

  • లోన్ మంజూరు చేసే సమయంలో మనం యాప్‌లో నమోదు ప్రారంభించగానే చరవాణిలోని సమాచారం అంటే మన కాంటాక్ట్ లిస్ట్, చిత్రాలు వాళ్ల ఆధీనంలోకి వెళ్తాయి.
  • వారడిగినట్లుగా డబ్బు చెల్లించకపోతే మొదట దగ్గరి బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసి ఫలానా వ్యక్తి లోన్ చెల్లించడం లేదని చెబుతారు.
  • రెండో దశలో హెచ్చరికలో భాగంగా లోన్​ తీసుకున్న వ్యక్తి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి అతడికి వాట్సాప్‌ చేస్తారు.
  • ఫోన్‌లోని ఇతర ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తామని బెదిరిస్తారు.
  • సెల్​ఫోన్​లో ఉన్న మహిళల నంబర్లకు అశ్లీల చిత్రాలను పంపిస్తామని హెచ్చరిస్తుంటారు.
  • అసలు తీసుకున్న లోన్​తో సంబంధం లేకుండా వాళ్లడిగినంత ఇచ్చినప్పటికీ ఇంకా కావాలని వేధిస్తారు.
  • ఫోన్ ముట్టడానికే భయపడే విధంగా మాటల దాడిని పెంచుతారు. చివరకు జీవితంపై విరక్తి వచ్చే విధంగా చేస్తారు.

స్వీయ జాగ్రత్తలే శ్రీరామరక్ష

  • ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్​ఫోన్​లో అనవసరమైన లింక్​లపై క్లిక్ చేసి మోసపోవద్దు.
  • ఎంతటి ఆర్థిక అవసరమైనా యాప్‌లలో లోన్ తీసుకోవద్దని దృఢ నిర్ణయం తీసుకోవాలి.
  • తల్లిదండ్రులకు తెలియకుండా యాప్‌ల రుణాలను ఆశ్రయిస్తున్న యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
  • ఒకవేళ లోన్​యాప్​లో ఇప్పటికే తీసుకున్న బాధితులు ఉంటే ఈ వ్యథ నుంచి తప్పించుకునేందుకు 1930 సహాయక నంబరుకు ఫిర్యాదు చేయాలి. వారిచ్చే సూచనలతో సంబంధిత పోలీసులను సంప్రదించాలి.

రుణయాప్​ల వేధింపుల కట్టడికి చర్యలేవీ? : అక్రమ లోన్​యాప్​ల ఆగడాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2022లో నిర్ణయం తీసుకుంది. యాప్‌ స్టోర్లలో కేవలం చట్టబద్ధమైన యాప్స్‌ మాత్రమే ఉండాలని, మిగిలినవి తొలగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సూచించింది. కానీ పాతవాటిని తొలగిస్తే కొత్త పేర్లపై వివిధ యాప్‌లు రూపొందించి దుండగులు ఆగడాలకు పాల్పడుతూనే ఉన్నారు.

"సెల్​ఫోన్ వినియోగంలో ప్రతి విషయంపైనా అప్రమత్తంగా ఉండాలి. మెసేజ్​ల రూపంలో వచ్చే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దు. ముఖ్యంగా లోన్​లు ఇస్తామనే యాప్‌ల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. లోన్​లు తీసుకునే విషయంలో చరవాణిలో ఎలాంటి ప్రక్రియలు కొనసాగించొద్దు. ఇతర మోసపూరిత వ్యాపార ప్రకటనలు, ఆఫర్‌ల విషయంలోనూ జాగ్రత్త. మా తరఫున ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. ఎవరికి వారుగా స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం"- నర్సింగరావు, కరీంనగర్‌ సైబర్‌క్రైం విభాగం ఏసీపీ

దా‘రుణం’ అంకెల్లో ఇలా

  1. సైబర్‌ కేసుల్లో లోన్ యాప్‌ల మోసాల వాటా 20 శాతం
  2. సగటున నెలకు యాప్‌ల దారుణాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నవారు 2
  3. ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారంతా 40 ఏళ్లలోపు వారే
  4. గతేడాది ఉమ్మడి జిల్లాలో రుణ యాప్‌ల మోసాలతో 42 మంది మృతి

లోన్​యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లు భరించలేక రేషన్ డీలర్ ఆత్మహత్య - BHUPALPALLY RATION DEALER SUICIDE

ఫేక్​ లోన్​ యాప్​లను ఇలా గుర్తించండి! - ఆ వలలో పడిపోతే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.