LB Nagar Lawyer Second Marriage Issue : మొదటి భార్య చనిపోయిందని రెండో పెళ్లి చేసుకున్న ఓ న్యాయవాది న్యాయ వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చాడు. కేవలం మొదటి భార్యకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారని మగ సంతానం కోసం మరో పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడు. ఈ ఘటన సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్‌లో పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తనకు, తన పిల్లలకు అన్యాయం జరిగిందంటూ లాయర్ మొదటి భార్య సరూర్ నగర్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించింది. ఎల్బీనగర్ నాగోల్ ప్రాంతానికి చెందిన న్యాయవాది అమరేందర్ పల్లవి అనే యువతిని కొన్నేండ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల జష్మిత రాయ్, ఐదేళ్ల అన్షిత రాయ్ అనే కుమార్తెలు ఉన్నారు.
"నాకు 2017లో హైకోర్టు న్యాయవాది అమరేందర్‌తో పెళ్లి జరిగింది. నాకు ఇద్దరు అమ్మాయిలు. మగ సంతానం కోసం నా భర్త నాలుగు సార్లు గర్భస్రావం చేయించాడు. గర్భసంచి బలహీనంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో పిల్లలు పుట్టరు అని తెలిసి నేను చనిపోయానని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను. " -బాధితురాలు
Advocate 2nd Marriage Issue : గతంలో చాలా సార్లు తనకు వారసుడు కావాలంటూ పల్లవిని వేధించడం మొదలు పెట్టాడని బాధితురాలు వాపోయింది. కొడుకు కోసం నాలుగు సార్లు గర్భస్రావం కూడా చేయించాడని తెలిపారు. అనంతరం గర్భసంచి బలహీనంగా ఉందని వైద్యులు తెలిపారని బాధితురాలు పల్లవి తెలిపింది. మగ సంతానం కోసం మొదటి భార్య చనిపోయిందని సిద్దిపేటకు చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది.
తనకి తెలియకుండానే గత నవంబర్‌లో రెండో వివాహం చేసుకున్నాడని దీంతో ఆగ్రహించిన మొదటి భార్య కుటుంబ సభ్యులు న్యాయవాదిని పట్టుకుని చితకబాదారు. న్యాయం చేయాలంటూ సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు నాకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.
Wife Cheating Case on Husband Hyderabad : మనువాడి.. భర్తకు రెండో పెళ్లి జరిపించి.. కట్ చేస్తే..!
రియల్ లైఫ్లో 'మళ్లీ పెళ్లి'.. ట్రెండ్ సెట్ చేసిన స్టార్స్ వీరే!