ETV Bharat / state

లా స్టూడెంట్స్ దారుణం - యువతిపై అత్యాచారం చేసిన భర్త - వీడియో తీసిన భార్య - TIRUPATI LAW STUDENT RAPES A WOMAN

Law Student Raped in Tirupati: గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరుపతి, గంజాయితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గంజాయి మత్తులో అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. న్యాయ విద్య చదువుకుని పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన ఆ దంపతులే హేయమైన చర్యకు పాల్పడ్డారు. తోటి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, దానిని వీడియో తీసి డబ్బులు డిమాండ్ చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 10:18 AM IST

Law Student Raped in Tirupati
Law Student Raped in Tirupati (ETV Bharat)

Law Student Raped in Tirupati : న్యాయ విద్య చదువుకొని ఆదర్శంగా జీవించాల్సిన యువ దంపతులు దారుణానికి పాల్పడ్డారు. గంజాయికి బానిసలై అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని గంజాయి మత్తు ఊబిలోకి దించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడి, డబ్బు డిమాండ్ చేసిన ఘటన తిరుపతి జిల్లాలో కలకలం రేపింది.

ఏం జరిగిందంటే: తిరుపతి గ్రామీణ పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి (22) నాలుగేళ్ల కిందట తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరారు. కొంతకాలం కాలేజీ వసతి గృహంలో ఉండేవారు. ఆ సమయంలో తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్లలో నివాసం ఉంటున్న సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణ (35) పరిచయమై, ఆమెతో స్నేహం ఏర్పడింది. దీంతో సదరు మహిళా తరచూ ఆమె ఇంటికి వచ్చేవారు. ఆ సమయంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్‌రెడ్డితో సైతం ఆమెకు పరిచయమైంది.

ఆటోలో ఇంటికి వెళుతున్న యువతి - అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ - Women Raped by Auto Driver

తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన అతను ఎస్వీయూ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గంజాయికి బానిసలైన దంపతులిద్దరూ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చే సదరు యువతికి సైతం అలవాటు చేశారు. దీంతో ఆ యువతి గంజాయి మత్తులో ఉన్నప్పుడు కృష్ణకిషోర్‌రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

భర్తను ప్రోత్సహించిన భార్య : ఆ దృశ్యాలను అతని భార్య వీడియో, ఫొటోలు తీసింది. తరువాత ఆ వీడియోలు, ఫొటోలతో ఆమెను బెదిరించి యువతి నుంచి బంగారు నగలు తీసుకున్నారు. అదే విధంగా ప్రణవ్‌కృష్ణ ఆ ఫొటోలు, వీడియోలను బాధిత యువతి సోదరుడితో పాటు, ఆమెకు కాబోయే భర్తకు సైతం పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధిత యువతి కుటుంబ సభ్యులు ఈ నెల 25వ తేదీన తిరుపతి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో కృష్ణకిషోర్‌రెడ్డి, ప్రణవకృష్ణలను ఆయా వర్సిటీల నుంచి సస్పెండ్‌ చేశారు.

పోర్న్​ వీడియోలు చూసి బాలికపై అత్యాచారం - ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసి? - NANDYALA MINOR GIRL RAPE CASE

ఇంతకన్నా దారుణం ఉండదేమో! - ఊయలలో ఉండగానే 6 నెలల చిన్నారిపై తాతయ్య అత్యాచారం - Rape on Six Months Baby

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.