ETV Bharat / state

వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? - ఈసారి జాలీగా 'తెలంగాణ మాల్దీవ్స్'​కు వెళ్లిరండి - THIRD ISLAND IN LAKNAVARAM LAKE

పర్యాటకుల మనసు కట్టిపడేసే లక్నవరం జలాశయం అందాలు - టూరిస్టుల కోసం సిద్ధమవుతున్న మూడో ఐలాండ్ - పర్యాటకులను రారమ్మని పిలుస్తున్న టూరిస్ట్ స్పాట్

Laknavaram Lake Tourism
Laknavaram Lake Tourism (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 25, 2024, 1:55 PM IST

Updated : Oct 25, 2024, 2:01 PM IST

Laknavaram Lake Tourism : ఆదివారం వస్తే చాలు చాలా మంది వీకెండ్​కు ఫ్లాన్ చేస్తుంటారు. వారంలో కనీసం ఆ ఒక్కరోజైన ప్రశాంతమైన వాతావరణంలో మనసును హాయిగా ఉంచుకోవాలని చూస్తారు. హైదరాబాద్​ నగరంలోనే ఉన్న పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ఉన్నా ట్రాఫిక్ రణగొణుల మధ్య వెళ్లాలనే మూడ్ కాస్తా మారిపోతోంది. అందుకే చాలా మంది నగరానికి దూరంగా వెళ్లి వీకెండ్​ను ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు.

ముఖ్యంగా చుట్టూ చెట్లు, రిజర్వాయర్లు లాంటి ప్రదేశాలకే ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అయితే తెలంగాణలోనూ అలాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ వాటన్నింటి కంటే భిన్నమైన పర్యాటక ప్రాంతం సైతం ఉంది. చుట్టూ నీళ్లు మధ్యలో బస చేయవచ్చు. ఈ అనుభూతిని ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. హైదరాబాద్​కు దగ్గరలోనే ఆ ప్రాంతం ఉంది. ఆ పర్యాటక భూతల స్వర్గధామమే ముులుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో ఉన్న లక్నవరం జలాశయం.

సహజ అందాలకు నెలవు లక్నవరం : లక్నవరం జలాశయం పేరు వినగానే ప్రతిసారి ఈ పేరు ఎక్కడో వింటున్నట్లు అనివిస్తుంది కదూ! ఆ జలాశయంలోనే మూడో ద్వీపం(ఐలాండ్​)ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే లక్నవరం జలాశయం సహజసిద్ధమైన అందాలకు నెలవు. అలాంటి రమణీయమైన ప్రదేశానికి ఇలాంటి ద్వీపం తోడైతే పర్యాటకులకు ఇక స్వర్గమే. ఈ ద్వీపాన్ని 8 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. ఈ ద్వీపాన్ని టీఎస్​టీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో పనులు చేస్తోంది.

మూడో ద్వీపం విశేషాలు :

  • లక్నవరం ఐలాండ్​లో పర్యాటకుల ఆహ్వాదానికి ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యాననవనాలు ఉన్నాయి
  • మొత్తం 22 కాటేజీలు ఉన్నాయి.
  • ఈ 22 కాటేజీల్లో నాలుగింటిని కుటుంబసభ్యులతో బస చేసేందుకు వచ్చే వారికి ఇవ్వనున్నారు.
  • ఈ ద్వీపంలో ఐదు ఈత కొలనులు ఉండగా వాటిలో నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలకు అనుబంధంగా నిర్మించారు.
  • పిల్లల కోసం ప్రత్యేకంగా ఈత కొలనులు, ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి.
  • పెద్దల కోసం రెండు స్పాలు, రెస్టారెంటు తదితర వసతులు.
  • మాల్దీవుులు, శిమ్లా, ముున్నార్ తదితర ప్రాంతాలను తలపించే విధంగా ఈ ద్వీపాన్ని సుందరీకరించారు.
  • ఫ్రీ కోట్స్​కు చెందిన 40 మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తారు.

లక్నవరం జలాశయానికి ఎలా వెళ్లాలి : హైదరాబాద్ నుంచి ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం జలాశయానికి 219 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే కరీంనగర్ నుంచి లక్నవరం జలాశయానికి వెళ్లాలనుకుంటే 141 కిలోమీటర్లు. ఖమ్మం నుంచి వెళ్లాలనుకుంటే 152 కిలోమీటర్లు దూరం. ఉదయం బయలుదేరితే మధ్యాహ్నానికి అక్కడకు చేరుకోవచ్చు. బస్సులు, క్యాబ్​ల ద్వారా కూడా ములుగు వరకు చేరుకొని అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్​పోర్టులో లక్నవరానికి వెళ్లవచ్చు.

చరిత్ర : లక్నవరం సరస్సుును 1312వ సంవత్సరంలో ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించాడు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఈ సరస్సును నిర్మించారు. ఎత్తైన కొండల మధ్య నిర్మించిన ఈ సరస్సు నేటి ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది. కాకతీయుుల శైలికి భిన్నంగా ఈ లక్నవరం సరస్సును నిర్మించారు. కాకతీయుల శైలి ప్రత్యేకంగా దేవాలయం, కోనేరు, నగరం అనే పద్ధతిలో ఉంటుంది. కానీ ఇది పూర్తి భిన్నం. అందుకే ఓసారి ఈ లక్నవరం జలాశయాన్ని చూసేయండి. కుటుంబంతో కలిసి పిక్​నిక్​లు, స్నేహితులతో కలిసి పర్యాటకానికి ఇది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ధరకే రెండు రోజుల యాత్ర- యాదాద్రి దర్శనంతో పాటు లక్నవరం బోటింగ్ ఇంకా మరెన్నో! - Kakatiya Heritage Tour Package

Laknavaram: లక్నవరం ఓ స్వర్గధామం... అక్కడ ప్రతిదీ ఓ దృశ్య కావ్యం

Last Updated : Oct 25, 2024, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.