ETV Bharat / state

కేసీఆర్‌ను జైలుకు పంపాల్సిన లక్ష్యం ఇంకా నెరవేరాల్సి ఉంది : రాజగోపాల్‌ రెడ్డి - Kurian Committee Opinion Poll - KURIAN COMMITTEE OPINION POLL

Congress Kurian Committee Investigation : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్​ నిజ నిర్ధారణ కమిటీ(కురియన్​ కమిటీ) అభిప్రాయ సేకరణ ముగిసింది. గురువారం 16 మంది లోక్‌సభ అభ్యర్థుల అభిప్రాయం తీసుకున్న కురియన్ కమిటీ, ఇవాళ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిల నుంచి ఎన్నికల వివరాలను సేకరించింది. ఈ వివరాలను ఈనెల 21న ఏఐసీసీకి నివేదిక అందజేస్తున్నట్లు కమిటీ సభ్యుడు రికిబుల్ హుస్సేన్‌ తెలిపారు.

Kurien Committee met Telangana Congress MLAs
Kurian Committee Meeting in Gandhi Bhavan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 8:25 PM IST

Updated : Jul 12, 2024, 9:21 PM IST

Kurian Committee Opinion Poll Concluded : తెలంగాణాలో పార్లమెంటు ఫలితాలపై ఆరా తీసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కురియన్‌ కమిటీ రెండు రోజుల పర్యటన ముగిసింది. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎంపీ అభ్యర్ధులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జిలు, డీసీసీ అధ్యక్షులతో భేటీ అయిన కురియన్‌ కమిటీ సభ్యులు అప్పటి రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు.

ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన కురియన్‌ కమిటీ భేటీకి పలువురు నాయకులు హాజరై వారి అభిప్రాయాలను తెలియచేశారు. మొదటి రోజు 16 లోకసభ అభ్యర్ధుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న కురియన్‌ కమిటీ ఇవాళ అనేక మంది నాయకులతో భేటీ అయ్యి వారి అభిప్రాయాలను తీసుకుంది. కురియన్‌ కమిటీని ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు కలిశారు.

కేసీఆర్‌ను జైలుకు పంపాల్సిన లక్ష్యం బాకీ : కోదాడ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చినట్లు కమిటికి చెప్పినట్లు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తెలిపారు. బీఆర్​ఎస్​ను ఓడించాలనే మొదటి లక్ష్యం నెరవేరిందని, కేసీఆర్‌ను జైలుకు పంపాల్సిన లక్ష్యం నెరవేరాల్సి ఉందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వెల్లడించారు.

"రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీనే ఉండదు. తప్పకుండా కాంగ్రెస్​ పార్టీయే ఇంకా పదేళ్లు అధికారంలో ఉంటుంది. బీఆర్ఎస్ ఖాళీ అవటం ఖాయం, హరీశ్​రావు సైతం బీజేపీలో చేరుతారు. ఇంకా జగదీశ్​ రెడ్డి యాదాద్రి పవర్​ ప్లాంట్​ విషయంలో అవినీతి చేశారు. ఇంక ఆయన జైలుకు వెళ్లటం పక్కా. అవినీతి ఆరోపణలు ఉన్న బీఆర్ఎస్ నేతలను ఎవరినీ మా పార్టీలోకి తీసుకోము."-కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే

Kurian Report Submit to AICC on 21st July : కురియన్‌ కమిటీతో కలిసి భువనగిరి పార్లమెంటు పరిధిలో రాజకీయ పరిణామాలపై వివరించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఎవ్వరూ ఉండరని, హరీశ్​రావు బీజేపీలోకి పోతాడని జోష్యం చెప్పిన రాజగోపాల్‌ రెడ్డి, జగదీశ్​ రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకోమని తెగేసి చెప్పారు.

కురియన్‌ కమిటీ ముందు హాజరై నిజామాబాద్‌లో ఏం జరిగిందో వివరించినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తెలిపారు. అందరి అభిప్రాయాలను సమగ్రంగా నోట్ చేసుకున్నట్లు కురియన్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ వివరాలు అన్నింటిని ఈనెల 21న ఏఐసీసీకి నివేదిక అందజేస్తున్నట్లు కమిటీ సభ్యుడు రికిబుల్ హుస్సేన్‌ తెలిపారు.

'పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు సీట్లు పెరిగాయి?' - ఈ అంశంపైనే కురియన్​ కమిటీ ఫోకస్ - Congress Fact Finding Committee

కాదుకాదంటూనే కారు దిగుతున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు - నేడు కాంగ్రెస్​ గూటికి ప్రకాశ్​ గౌడ్ - BRS MLA Prakash Goud will Join Cong

Last Updated : Jul 12, 2024, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.