KTR tweet on NEET Paper Leak : నీట్ పేపర్ లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీతో తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని వారు నిరసనబాట పడుతున్నారు. మరోవైపు నీట్ పేపర్ లీకేజీపై విపక్ష పార్టీలు సైతం గళం విప్పాయి. నీట్ పరీక్ష నిర్వహణలో అధికార ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తాయి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
It’s truly an unfortunate turn of events for the students shattering their academic careers
— KTR (@KTRBRS) June 24, 2024
❌ June 4 : NEET-UG paper leak
❌ June 19: UGC-NET cancelled
❌ June 21: CSIR-UGC-NET postponed
❌ June 22: NEET-PGT postponed in the last minute
The BJP-led NDA government's…
మరోవైపు నీట్ పేపర్ లీకేజీపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నా ప్రధానమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీకేజీపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలు, ఎలాంటి పొంతన లేకుడా ఉన్నాయని ఎక్స్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు.
ఎన్టీఏ అసమర్థతపై కేంద్ర విద్యా శాఖ మంత్రి వివరణ ఇవ్వాలి : కేటీఆర్
నీట్- యూజీ ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయినట్లు రుజువైనా, మోదీ ప్రభుత్వం జులై ఆరో తేదీ నుంచి కౌన్సిలింగ్ కొనసాగిస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ తప్పుబట్టారు. విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరం చేసేలా వరుస సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ నాలుగో తేదీన నీట్- యూజీ పేపర్ లీక్ అయిందని, జూన్ 19న యూజీసీ - నెట్ పరీక్ష రద్దయిందని పేర్కొన్నారు. జూన్ 21న సీఎస్ఐఆర్- యూజీసీ- నెట్ పరీక్ష వాయిదా పడగా, జూన్ 22న చివరి నిమిషంలో నీట్- పీజీ పరీక్ష వాయిదా పడిందని తెలిపారు. ఎలాంటి నిర్ధిష్ట కారణాలు చూపకుండా నీట్- పీజీ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేశారని, ఈ నిర్ణయాల వెనక ఉన్న లాజిక్ ఏంటని ప్రశ్నించారు. అన్నింటికీ కారణం నేషనల్ డిజాస్ట్రర్ అలయన్స్ ( ఎన్డీయే ) అని కేటీఆర్ పేర్కొన్నారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్రప్రభుత్వానికి కేటీఆర్ ఇది వరకే లేఖ రాశారు.
నీట్‌పై ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది?: కేటీఆర్ - KTR Tweet On NEET Exam
పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని నీట్ వ్యవహారంపై స్పందించాలి : కేటీఆర్ - KTR Letter On NEET Exam