KTR Reaction on Bathukamma Sarees Distribution : బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యతిరేకించారు. ఈ నిర్ణయంతో నేతన్నల ఆత్మహత్యలు పెరుగుతాయని అన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే 10 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికైనా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టే దిశగా ఆలోచించాలని డిమాండ్ చేశారు. తద్వారా నేతన్నలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నారు.
-
The Congress government has sounded another death knell for weavers
— KTR (@KTRBRS) July 9, 2024
Leaving poor weavers in distress, the government has decided to halt the distribution of Bathukamma Sarees, a tradition the BRS government practiced for 7 years
Every year, the BRS government distributed around… pic.twitter.com/57ShqOR6mf
KTR Slams Congress Govt : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలపై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తోందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నేతన్నల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించినట్లు తెలిపారు. ఏడేళ్ల పాటు కొనసాగిన ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా రాష్ట్రంలో నేతన్నలకు దన్ను లభించిందని, ఫలితంగా ఆత్మహత్యలు ఆగిపోయాయని వెల్లడించారు.
బతుకమ్మలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి: గవర్నర్
ఏటా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి చీరలను పంపిణీ చేసేదని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ సదుద్దేశంతో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కారణంగా పేద మహిళలకు పండుగ పూట ప్రభుత్వ కానుకగా చీర అందేదని పేర్కొన్నారు.
బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులు ఎంతో మంది ఉపాధి పొందే వారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కేటీఆర్ సూచించారు. తమ ప్రభుత్వం మీద కక్షతో వారి ఉసురు తీయవద్దని కోరారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసిన కారణంగా ఇప్పటికే పది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాలోచిత చర్యలు మానుకోవాలని, వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు ఉపాధి కల్పించాలని ఎక్స్ ద్వారా డిమాండ్ చేశారు.