ETV Bharat / state

నిధుల సమీకరణ కోసం ప్రమాదకరమైన మార్గం - ఇలాగైతే మన బిడ్డలకు కొలువులు వచ్చేదెలా? : కేటీఆర్ - KTR OPPOSED GOVT LANDS MORTGAGE

KTR Slams Congress Over Govt Land Mortgage : కాంగ్రెస్ ప్రభుత్వం భూములను తనఖా పెట్టి నిధులు సమీకరించాలనుకుంటుందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. 20 వేల కోట్ల విలువ చేసే భూములను తనఖా పెట్టి, 10 వేల కోట్ల నిధులు సమీకరించాలనుకుంటుందని ఆరోపించారు. భూముల తనఖాను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని ఎక్స్ ద్వారా ప్రకటించారు.

BRS Working President KTR
BRS Working President KTR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 10:26 AM IST

Updated : Jul 10, 2024, 10:56 AM IST

KTR Criticized The Mortgaging Government Lands Idea : రాష్ట్ర ప్రభుత్వం భూములు తనఖా పెడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. భూములను తాకట్టు పెట్టడాని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. 400 ఎకరాల భూమిని తనఖా పెట్టాలనుకోవడం అనాలోచిత చర్యగా కేటీఆర్ అభివర్ణించారు.

రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందని కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి 10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం ఉందని ఎక్స్‌ వేదికగా తెలిపారు.

భూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖా పెట్టేందుకు మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి 100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడుతుందని పేర్కొన్నారు. కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

'సీఎంగా మీకు మోకా వస్తే, డీఎస్సీ అభ్యర్థులకు ఇంత ధోకా చేస్తారా' - రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ - KTR Fires on CM Revanth Reddy

కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కొత్తగా పెట్టుబడులు రావడం లేదని కేటీఆర్ ఆరోపించారు.

ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడుతుందని తెలిపారు. రేపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోయే కంపెనీలకు ఏమిస్తారని ప్రశ్నించారు. కంపెనీలు రాకుండా కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ మీద కక్షతో నేతన్నల ఉసురు తీయవద్దు - బతుకమ్మ చీరల ఆర్డర్లపై కేటీఆర్ - KTR Reaction on Bathukamma Sarees

Last Updated : Jul 10, 2024, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.