ETV Bharat / state

కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది : కేటీఆర్ - KTR Comments On Valmiki Scam

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2024, 4:45 PM IST

BRS MLA KTR On Valmiki Scam In Karnataka : కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ అకౌంట్ల నుంచి అక్రమంగా పార్లమెంట్ ఎన్నికల ముందు రూ.180 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. హైదరాబాద్​లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్లకు రూ.45 కోట్లు ట్రాన్స్​ఫర్ చేశారన్నారు.

KTR COMMENTS ON VALMIKI SCAM
BRS MLA KTR On KTR ON Valmiki Scam (ETV Bharat)

BRS MLA KTR On KTR ON Valmiki Scam : కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కిందా మీద పడి సీఎం రేవంత్ రెడ్డి మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. విషయాలను బయటకు రాకుండా ఆపుతున్నారని ఆరోపించారు. ఆ మబ్బులు నాలుగైదు రోజుల్లో వీడిపోతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ అకౌంట్ల నుంచి అక్రమంగా పార్లమెంట్ ఎన్నికల ముందు రూ.180 కోట్లు దారి మళ్లించారిని ఆరోపించారు.

కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య డబ్బులు దారి మళ్లించామని ఒప్పుకున్నారని తెలియజేశారు. హైదరాబాద్​లోని తొమ్మిది బ్యాంకు అకౌంట్లకు రూ.45 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్​కు ఏమైందో కానీ ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. బ్యాంకు అధికారులతో పాటు 11 మందికి ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు చెందిన ఎవరి అకౌంట్లలోకి వచ్చాయని తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ నేతల డొంక కదులుతోందని ఆయన తెలిపారు.

గత ఎన్నికల్లో ఈ డబ్బును కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఓ మీడియా సంస్థ ద్వారా బిజినెస్ అనే కంపెనీకి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని తెలిపారు. తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో బంగారం షాపులు, బార్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.

వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏమిటని, ఇవన్నీ బయటకు రావాలని ఆయన కోరారు. సిద్ధరామయ్యను తొలిగిస్తే పక్కన ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి సతీష్ జార్ఖిహొలీ అంటున్నారని ఆయన తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్న బంధం వాల్మీకి స్కామేనా? వాల్మీకి స్కామ్​లో భారీ మొత్తంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వాటాలు వచ్చాయని తెలిసినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరని, ఈ అంశంపై రాహుల్ గాంధీ గుట్టు విప్పాలని ఆయన కోరారు.

మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చా - కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరి సరికాదు : కేటీఆర్ - KTR on Women Commission Investigate

మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్ - బుద్ధ భవన్​ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత - BRS and Congress Protest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.