ETV Bharat / state

ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ : కేటీఆర్ - KTR about Forest in Telangana - KTR ABOUT FOREST IN TELANGANA

KTR about Forest and Trees in Telangana : దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్​ అన్నారు. ఇవాళ ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం కేసీఆర్​ హయంలో తీసుకున్న చర్యలను​ కొనియాడుతూ ఆయన ఎక్స్ వేదికగా వివరించారు.

KTR on Haritha Haram in Telangana
KTR about Forest and Trees in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 9:17 PM IST

KTR about Forest and Trees in Telangana : దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ అని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR)తెలిపారు. ప్రకృతి ప్రేమికులందరికీ ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన, కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో పచ్చదనం పెంపు కోసం తీసుకున్న చర్యలను ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో ఆగమైన అడవి సంపద చుట్టూ అందమైన పచ్చని పందిరి అల్లిన ప్రకృతి ప్రేమికుడు కేసీఅర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో మహోద్యమంలా సాగిన ఆనాటి హరితహారం, 230 కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పం, ప్రపంచ చరిత్రలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమని కేటీఆర్ వివరించారు.

KTR on Haritha Haram in Telangana : సుమారు 15 వేల నర్సరీల పెంపకంతో మహాయజ్ఞంలో సరికొత్త అధ్యాయం అన్న కేటీఆర్​, ఎనిమిది శాతం పచ్చదనం పెరగడం దేశంలో ఎప్పుడూ లేదని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకు చిత్రాన్ని మార్చడమే కాదన్న ఆయన, చిక్కిశల్యమైన అడవులు, సకల జీవరాశులను సంరక్షించడమని నలుదిశలా చాటిచెప్పిన నాయకత్వం మనది అని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ పదేళ్ల ప్రస్థానం పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణం అన్న ఆయన, నాడు ప్రతి పల్లె పచ్చదనంతో మురిసిందని, ప్రతి పట్నం హరిత శోభతో వెల్లివిరిసిందని తెలిపారు. నేడు గ్లోబల్ వార్మింగ్(Global Warming)​తో మానవాళికి వార్నింగ్​లు, ఎటుచూసినా క్లౌడ్ బస్టులు, కుండపోతల ప్రమాద ఘంటికలు అని పేర్కొన్నారు.

గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ : ప్రకృతి విపత్తులను అరికట్టాలన్నా, పర్యావరణ సమతుల్యత సాధించాలన్నా, ఆపదలో ఉన్న ఆటవీ సంపద కాపాడాలన్నా, మానవజాతి చేతిలో ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం హరితహారం అని కేటీఆర్ వివరించారు. నాడు, నేడు, ఏనాడైనా బీఆర్​ఎస్​ నమ్మే సిద్ధాంతం ఇదే అన్న ఆయన, అందుకే జంగిల్ బచావో జంగిల్ బడావో నినాదాన్ని నాటి సీఎం కేసీఆర్ అక్షరాలా నిజం చేశారని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు మనమిచ్చే వారసత్వ సంపద కాంక్రీట్ జంగిళ్లు కానే కాదని, పచ్చని అటవీ సంపద అని చాటిచెప్పి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను తలదన్నేలా నిర్మించిన గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ(Great Wall of Telangana)అని కేటీఆర్ ఎక్స్​లో పేర్కొన్నారు.

రజాకార్ నిర్మాతకు బెదిరింపు కాల్స్‌ - సీఆర్పీఎఫ్‌ భద్రత కల్పించిన కేంద్రం - crpf security to Razakar producer

రామగుండం నగరాభివృద్ధి పనులు - సందిగ్ధంలో వ్యాపారుల జీవితాలు - GODAVARIKHANI ROAD EXPANSION Works

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.