ETV Bharat / state

గత ప్రభుత్వం వల్లే ట్రైబల్ మ్యూజియం ఆలస్యమైంది : కిషన్ రెడ్డి - Seetaka on Ramji Gond Museum

Kishan Reddy Laid Down Ramji Gond Museum in Hyderabad : గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్​లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్కతో కలిసి రామ్ జీ గోండు ట్రైబల్ మ్యూజియానికి శంకుస్థాపన చేశారు.

kishan reddy reddy laid Down Ramji Gond Museum in Hyderabad
గత ప్రభుత్వం వల్లే రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియంకు ఆలస్యమైంది : కిషన్ రెడ్డి
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 5:38 PM IST

Updated : Feb 16, 2024, 8:32 PM IST

Kishan Reddy Laid Down Ramji Gond Museum in Hyderabad : నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్ జీ గోండు పోరాటం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. గిరిజన సంస్కృతి(Tribal Culture) సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అందుకే హైదరాబాద్​లో రామ్ జీ గోండు పేరుతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పది ట్రైబల్ మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం వల్లే ట్రైబల్ మ్యూజియం ఆలస్యం : ఆంధ్రప్రదేశ్​లోనూ మ్యూజియానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని వివరించారు. ఇవాళ హైదరాబాద్ ​అబిడ్స్​లో రామ్ జీ గోండు ట్రైబల్ మ్యూజియానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి(Panchayat Raj Minister) సీతక్కతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఆనాటి కేసీఅర్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మండిపడ్డారు.

Central Tribal University in Telangana 2023 : 9 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ.. వనదేవతల చెంత విద్యాకేంద్రం

కేసీఆర్​కు ఎన్ని లేఖలు రాసినా స్పందన రాలేదని చెప్పారు. ఇవాళ ట్రైబల్ మ్యూజియానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(Central Tribal University) ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. గిరిజన విశ్వవిద్యాలయం వల్ల విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని, మొదటి ఫేజ్​లో రూ.900 కోట్లు గిరిజన యూనివర్సిటీకి కేటాయించామని తెలిపారు.

Minister Seethakka on Ramji Gond Museum : రూ. 420 కోట్లతో 17 ఏకలవ్య పాఠశాలలను తెలంగాణలో ప్రారంభించామని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి గుర్తు చేశారు. మేడారం జాతరకు రూ. 3 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. గిరిజనులకు భూముల హక్కులను కూడా కల్పిస్తున్నామని, వారి సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కుల(Tribal Rights) కోసం కొమురం భీం, రామ్ జీ గోండు పోరాటం చేశారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Seethakka) కొనియాడారు. రామ్ జీ గోండు మ్యూజియానికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

'2018లో రామ్ జీ గోండు మ్యూజియం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. అనేక రాష్ట్రాల్లో కూడా ట్రైబల్ మ్యూజియం ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్​లోనూ అల్లూరి సీతారామరాజు ట్రైబల్ మ్యూజియం పేరుతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి'- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి​

గత ప్రభుత్వం వల్లే ట్రైబల్ మ్యూజియం ఆలస్యమైంది : కిషన్ రెడ్డి

'కాంగ్రెస్, బీఆర్ఎస్​ నాణానికి బొమ్మాబొరుసు లాంటివి - రాష్ట్ర పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయింది

'రాష్ట్రానికి పెనుభారంగా మారనున్న కాళేశ్వం ప్రాజెక్ట్ - కాగ్​ రిపోర్ట్​లో​ సంచలన విషయాలు

Last Updated : Feb 16, 2024, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.