ETV Bharat / state

"కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే, కాంగ్రెస్ పాలన అంకెల గారడీతోపాటు మాటల గారడీ"

Kishan Reddy on State Budget : రాష్ట్ర బడ్జెట్‌ అంకెల, మాటల గారడీగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలపై ఏమీ చెప్పలేదని విమర్శించారు. వ్యవసాయానికి అంతంత మాత్రమే నిధులు కేటాయించారన్న కేంద్రమంత్రి, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాల పరిస్థితేంటని ప్రశ్నించారు.

Vote on Budget Announced in Telangana
Kishan Reddy on State Budget
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 7:51 PM IST

Kishan Reddy on State Budget : కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే, కాంగ్రెస్ పాలన అంకెల గారడీతో పాటు మాటల గారడీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని మండిపడ్డారు. అసెంబ్లీలో(Telangana Assembly) ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై స్పందించిన కిషన్ రెడ్డి, మొత్తం మీద ఈ ఓట్​ ఆన్​ అకౌంట్​​ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాల అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోందని అన్నారు.

రూ.2.95 లక్షల కోట్లతో నేడు ఓట్​ ఆన్​ అకౌంట్ బడ్జెట్​! - ఆరు గ్యారంటీలకే పెద్దపీట

ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప, వారిచ్చిన ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదని విమర్శించారు. కేంద్రమంత్రి విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలపై కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు.

Telangana Budget 2024 : వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారని మరి రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి(Seed Development) పరిస్థితేంటని ప్రశ్నించారు. అనేక వ్యవసాయరంగ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందో సమాధానం చెప్పాలన్నారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా ఇస్తామన్నారు. అవి నీటిమీద రాతలేనా, కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీ, ఇక అమలుకానట్టేనని వ్యాఖ్యానించారు.

రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?

BJP Chief Kishan Reddy Fire on Congress Party : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు దోఖా చేసిందన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌ చట్టబద్దత కల్పిస్తామనే వాగ్దానాన్ని తుంగలో తొక్కి బీసీలను నిలువునా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయితీల బలోపేతం గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఎద్దేవా చేశారు. గతంలో గ్రామ పంచాయితీలకు దశాబ్దాలుగా ఎన్నికలు నిర్వహించని చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు.

‘యూత్ డిక్లరేషన్’కు నిధులెక్కడ? : మూసీ నది ప్రక్షాళన కోసం ఒకసారి గుజరాత్ సబర్మతీ నది దగ్దరకు వెళ్తే సుందరీకరణ ఎలా చేయాలో అర్థమవుతుందని హితవు పలికారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి(Rajeev Arogyashri) ఎన్ని నిధులు కేటాయించారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్​లో ఆర్భాటంగా ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’ కోసం ఎక్కడా నిధులు కేటాయించలేదని, విద్యారంగం గురించి చెప్పిన అంశాలన్నీ నీటిమీద రాతలేనని స్పష్టమైందన్న కిషన్ రెడ్డి, అసలు బడ్జెట్ ప్రసంగంలో యూనివర్సిటీల ఊసేలేదని విమర్శించారు.

రైతులకు ఎన్నికల్లో చెప్పింది చాంతాడంత - బడ్జెట్​లో ఇచ్చింది చెంచాడంత : హరీశ్​ రావు

మేడిపండు లాంటి బడ్జెట్, నేమ్ ఛేంజర్​ ​మాత్రమే గేమ్ ఛేంజర్ కాదు : బీఆర్​ఎస్ నేతల రియాక్షన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.