ETV Bharat / state

కవిత సీబీఐ బెయిల్ పిటిషన్‌పై మే 2న తుది ఉత్తర్వులు - ఈడీ బెయిల్ పిటిషన్​ రేపటికి వాయిదా - KAVITHA BAIL PETITION HEARING - KAVITHA BAIL PETITION HEARING

MLC Kavitha Bail Petition Hearing Today : సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. లిక్కర్‌ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నందున ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ కోరగా, బెయిల్‌కు కవిత అర్హురాలని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ కేసులో కోర్టు తుది ఉత్తర్వులు వాయిదా పడిన వెంటనే, ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు మొదలయ్యాయి. కవిత వాదనల అనంతరం, న్యాయస్థానం విచారణ వాయిదా వేయటంతో మంగళవారం మధ్యాహ్నం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి.

Delhi Liqour Scam Updates
BRS MLC Kavitha Bail Petition Hearing Today
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 2:31 PM IST

Updated : Apr 22, 2024, 8:26 PM IST

BRS MLC Kavitha Bail Petition Hearing Today : దిల్లీ మద్యం విధానంపై సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు ముగిశాయి. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. పీఎంఎల్‌ఏ (PMLA) సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు కవిత అర్హురాలు అని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, ఈడీ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు.

లిక్కర్ స్కామ్​తో నాకు సంబంధం లేదు - నాకెలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు : కవిత - MLC Kavita Letter to Judge

అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకున్నా, కవితను అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. బీఆర్ఎస్‌కు కవిత స్టార్‌ క్యాంపెయినర్‌ అని కోర్టుకు తెలిపిన ఆమె తరఫు న్యాయవాది, ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదన్నారు. మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలరన్న సీబీఐ తరఫు న్యాయవాది, లిక్కర్‌ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న రౌస్‌ అవెన్యూ కోర్టు, తీర్పును రిజర్వ్‌ చేసింది.

Delhi Liqour Scam Updates : కవిత బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం మే 2న తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. సీబీఐ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన వెంటనే, ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి. కవిత తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, విచారణకు సహకరిస్తున్న కవితను అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై 10 స్టేట్‌మెంట్‌లు ఇచ్చారని, కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.

అనుమానితురాలిగానూ లేని కవితను నిందితురాలిగా మార్చారని, విచారణకు హాజరైన సమయంలో కరడుగట్టిన నేరస్థుల్లా చూశారన్నారు. మార్చి 15న ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారన్న సింఘ్వి, కవిత - కేజ్రీవాల్‌లను కలిపి విచారించడంలో ఈడీ విఫలమైందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో విజయ్ నాయర్ సోషల్ మీడియా వ్యవహారం చూస్తారని, ఆయనతో సోషల్ మీడియా అంశంపై మాత్రమే భేటీ అయినట్లు వివరించారు.

బుచ్చిబాబు నాలుగు స్టేట్‌మెంట్‌లు ఇచ్చారన్న కవిత తరఫు న్యాయవాది సింఘ్వీ, ఈడీకి (ED) అనుకూలంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాకే ఆయనకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. మాగుంట రాఘవరెడ్డి, బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీ నుంచి పోటీలో ఉన్నారని, అతను ఎందుకు ఆ పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు. శరత్‌రెడ్డి, బీజేపీ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తి అని ఆరోపించిన కవిత తరఫు న్యాయవాది, వారిచ్చిన స్టేట్‌మెంట్స్‌ ఆధారంగా కవితను అరెస్ట్ చేశారన్నారు.

కవిత తన ఫోన్లను కావాలనే ఫార్మాట్‌ చేసినట్లు ఈడీ ఆరోపిస్తుందన్న కవిత తరపు న్యాయవాది, కవిత ఎవరికీ ఫోన్ ఇచ్చినా ఫార్మాట్ చేసే వాడతారని కోర్టుకు వివరించారు. కవిత వాడిన అన్నీ మొబైల్ ఫోన్లను ఈడీకి ఇచ్చామని ఆమె న్యాయవాది సింఘ్వీ, మొత్తం 6 ఫోన్లు అందించినట్లు చెప్పారు. కవిత తరపు న్యాయవాది వాదనల అనంతరం తదుపరి విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

'కవిత విచారణకు సహకరించలేదు - తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారు' - delhi liquor scam case updates

జపమాల, నరసింహ శతకం, గజేంద్ర మోక్షం - వీటిని ఇచ్చేందుకు కవితకు కోర్టు అనుమతి - Court Grants Facilities to Kavitha

Last Updated : Apr 22, 2024, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.