Actress Shobhita Commits Suicide In Hyderabad : హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీరాంనగర్‌లో భర్త సుధీర్‌తో కలిసి ఆమె నివాసం ఉంటోంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. బ్రహ్మగంతు, నినిదలే వంటి కన్నడ సీరియల్స్‌తోపాటు కొన్ని సినిమాల్లోనూ ఆమె నటించారు. ఏడాది క్రితం సుధీర్‌ను వివాహం చేసుకున్న శోభిత అప్పటి నుంచి నటనకు దూరంగా ఉంటోంది. మృతురాలిది కర్ణాటకలోని సక్లేశ్‌పూర్ కాగా హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఉస్మానియా ఆస్పత్రిలో శవపరీక్ష తర్వాత మృతదేహాన్ని కర్ణాటకకు తరలించే అవకాశం ఉంది. శోభిత ఆత్మహత్యకు కారణాలపై గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య - ACTRESS SHOBHITA COMMITS SUICIDE
ఇంట్లో ఫ్యాన్‌కు ఊరివేసుకోని ఆత్మహత్య చేసుకున్న కన్నడ బుల్లితెర నటి శోభిత - బ్రహ్మగంతు,నినిదలే సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత

Published : Dec 1, 2024, 7:33 PM IST