ETV Bharat / state

పారిశుద్ధ్య విభాగం తప్పునకు మమ్మల్ని సస్పెండ్​ చేయడమేంటి? - అధికారులు, వైద్యుల మధ్య 'ఎలుక' వివాదం - Kamareddy doctors suspended

Kamareddy Govt Hospital Issue : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిపై ఎలుక దాడి చేసి గాయపర్చిన వ్యవహారం అధికారులు, వైద్యుల మధ్య వివాదంగా మారింది. ఐసీయూలో ఉన్న ఓ రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో వైద్యుల మీద వేటు పడింది. పారిశుద్ధ్య విభాగం తప్పునకు తమను సస్పెండ్‌ చేయటం సరికాదని వైద్యులు నిరసన తెలిపారు. వైద్య శాఖ మంత్రిని కలిసి సస్పెన్షన్‌ ఎత్తేయాలని వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు ఎలుకల బెడద పట్ల రోగులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Kamareddy Rat Infestation
Rat Infestation In Kamareddy
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 8:43 AM IST

రోగులకు ఎలుకలు కరిసినందుకు సస్పెండ్​ చేస్తారా? - ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : కామారెడ్డి జిల్లా ఆస్పపత్రి వైద్యులు

Kamareddy Govt Hospital Issue : కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఎలుకలు రోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో వరంగల్ ఎంజీఎం​ ఆస్పత్రిలోనూ మూషికాల బెడద చర్చనీయాంశమైంది. తాజాగా కామారెడ్డి జిల్లా హాస్పిటల్​ ఐసీయూలో రోగిని ఎలుకలు గాయపర్చడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ ఇద్దరు వైద్యులు, ఒక స్టాఫ్​ నర్సును సస్పెండ్‌ చేశారు. ఆసుపత్రి పర్యవేక్షకురాలిని విధుల నుంచి తప్పించారు. ఎలుకల సంచారం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని కరిచిన ఎలుకలు - కాళ్లు, చేతులకు తీవ్ర రక్తస్రావం

Rat Infestation Government Hospital In Kamareddy : ఈ వ్యవహారంలో అధికారులు, వైద్యుల మధ్య వివాదం ఏర్పడింది. నిర్వహణ లోపాలకు తమను బాధ్యులుగా చేయడం ఏంటంటూ వైద్యులు కామారెడ్డి జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. తగిన సౌకర్యాలు, సిబ్బంది లేకపోయినా మెరుగైన సేవలందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిసి సస్పెన్షన్‌ ఎత్తేయాలని విన్నవించారు.

"కామారెడ్డి ఆసుపత్రిలో డాక్టర్​లు, స్టాఫ్​ నర్స్ విధిగా ప్రతిరోజు రౌండ్స్​ తిరుగుతారు. ఎలుక బెడద నివారించడానికి సూపరింటెండెంట్, వైద్యులను ఎగ్జామిన్ చేశాం. ఆసుపత్రిలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోగులు తిను బండారాలు అక్కడక్కడ పడేయడం వల్ల ఎలుకల బెడద పెరిగింది."-డా.అజయ్ కుమార్, కమిషనర్‌, వైద్య విధాన పరిషత్

భారత్‌.. ఎలుకల్ని చంపే విషం ఎగుమతి చేయవా?

Kamareddy Rat Infestation : ఆస్పత్రిలో ఎలుకల సంచారంపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోగులకు మధ్యాహ్న భోజనం పెట్టే కేంద్రంలోని పప్పులు, బియ్యం తినేందుకు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి తోడు ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. 150 పడకల ఆసుపత్రిని శుభ్రం చేసేందుకు సరిపడా కార్మికులు లేరు. పలుచోట్ల తలుపులు ధ్వంసం కాగా, కిటికీలకు జాలీలు కరవయ్యాయి. ఎలుకలు విద్యుత్తు తీగలను కొరుకుతుండటంతో ఇప్పటి వరకు 20 ఏసీలు పాడయ్యాయి. తరచూ మరమ్మతులు చేపట్టాల్సి వస్తుండటంతో నిధులు వృథా అవుతున్నాయి. ఎలుకల బెడదపై రోగులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదాలను పక్కనపెట్టి ఆసుపత్రిలో ఎలుకల బెడద నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

"నిర్మాణ పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి. రోగులకు భద్రత కల్పిచడంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఆసుపత్రిలో ఎలుకలు కరవడంతో సస్పెండ్ చేయడం సరైంది కాదు. ప్రభుత్వం వెంటనే ఈ సస్పెన్షన్​ను ఎత్తివేయాలి."-డాక్టర్ వసంత్, సస్పెండ్ అయిన వైద్యుడు

అయోధ్యలో ఎలుకల గండం.. 'ఏం చేస్తే పోతాయి?'

రోడ్డుపై ప్రయాణించేదెలా? ఇరుకు రోడ్లతో ఇక్కట్లు - విస్తరణకు మోక్షమెప్పుడో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.