ETV Bharat / state

ఆకస్మిక పర్యటనలకు సిద్ధమవుతున్న జస్టిస్ పీసీ ఘోష్ - నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదికలకు ఆదేశాలు - PC Ghosh focus on Kaleshwaram

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 3:15 PM IST

Updated : Jun 13, 2024, 3:32 PM IST

Kaleshwaram Project Damage Issue : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జస్టిస్​ పీసీ ఘోష్​ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు నిర్మాణంలో నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదికను జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ కోరింది.

Kaleshwaram Project Damage Issue
Kaleshwaram Project Damage Issue (ETV Bharat)

Justice PC Ghosh Asked for Interim Report on Kaleshwaram Project : మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలపై రెండు వారాల్లోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. మూడు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న కమిషన్ నేడు నిపుణుల కమిటీతో సమావేశమైంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను సందర్శించిన కమిటీ సభ్యులు వారి పరిశీలన, అధ్యయనంలో గుర్తించిన అంశాలను జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​కు వివరించారు. సాంకేతిక పరమైన అంశాలు, అంతర్జాతీయ పరంగా అవలంభించే విధానాలను తెలిపారు. బ్యారేజీలుగా నిర్మించి ఎక్కువ నీటిని నిల్వ చేయడం వల్లే సమస్య తలెత్తిందని వారు కమిషన్​కు చెప్పినట్లు సమాచారం.

ఈ పరిశీలన అంశాల ఆధారంగా రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాత పూర్తి నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి జస్టిస్​ పీసీ ఘోష్​ స్పష్టం చేశారు. నేడు హైడ్రాలజీ విభాగానికి చెందిన ఇంజినీర్లను కమిషన్​ విచారణ చేసింది. వారిని కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అఫిడవిట్లు అన్నీ వచ్చి పరిశీలించిన తర్వాత బీఆర్కే భవన్​లోని బహిరంగ విచారణ చేసేందుకు జస్టిస్​ పీసీ ఘోష్​ సిద్ధమవుతున్నారు. అఫిడవిట్ల పరిశీలన అనంతరం సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.

సాంకేతిక అంశాల అనంతరం ఆర్థిక అంశాలపై కమిషన్​ దృష్టి సారించనుంది. ఆనకట్ట నిర్మాణ అంచనాలు, రుణాలు, వడ్డీ రేట్లు, తదితరాలపై విచారణ చేయనున్నారు. అటు కొంతమంది వ్యక్తులు, ఇతర మార్గాల్లో కూడా కమిషన్​ సమాచారాన్ని సేకరిస్తోంది. విజిలెన్స్​ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదిక సమర్పించాలని గతంలోనే కమిషన్​ ఆదేశించినా అది ఇప్పటికీ చేరలేదని అంటున్నారు. దీంతో వెంటనే నివేదిక సమర్పించాలని కమిషన్​ మరోమారు స్పష్టం చేసింది. కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​(కాగ్​) నుంచి కమిషన్​ నివేదిక కోరింది. విచారణ ప్రక్రియలో భాగంగా కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక పర్యటనలకు కూడా వెళ్లాలని జస్టిస్​ పీసీ ఘోష్​ భావిస్తున్నట్లు సమాచారం.

విజిలెన్స్​ కమిటీ రిపోర్టు : జేఎన్​టీయూ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర రావు ఛైర్మన్​గా ఏర్పాటైన ఈ కమిటీలో విశ్రాంత సీఈ సత్య నారాయణ, వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణ మూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా, ఈఎన్సీ అనిల్ కుమార్ కన్వీనర్​గా ఉన్నారు. కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు లోపాలను పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ కుంగడం, ఇతర సమస్యలకు కారణాలతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద ఉత్పన్నమైన సమస్యలకు గల కారణాలను అధ్యయనం చేశారు. తమ పరిశీలన, అధ్యయనంలో వచ్చిన అంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్‌కు వివరించారు.

కాళేశ్వరంపై న్యాయ విచారణ గడువు పొడిగింపు! - నేడు నిపుణులతో జస్టిస్‌ ఘోష్‌ సమావేశం - KALESHWARAM INQUIRY EXTENDED

తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసిన వారిపై చర్యలు ఉంటాయి : జస్టిస్‌ పీసీ ఘోష్‌ - Justice PC Ghosh on Kaleshwaram

Last Updated : Jun 13, 2024, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.