ETV Bharat / state

కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ అప్డేట్ - ఇవాళ కమిషన్ ముందుకు మూడు బ్యారేజీల ఈఈలు - KALESHWARAM PROJECT JUDICIAL INQUIRY LATEST UPDATE

Judicial Inquiry on Kaleshwaram Barrages EEs Today : కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు మూడు ఆనకట్టలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు కమిషన్ ముందుకు హాజరుకానున్నారు. వీరిని జస్టిస్ పీసీ ఘోష్ విచారించనున్నారు.

Justice PC Ghose Commission Inquiry on Barrages EEs
Justice PC Ghose Commission Inquiry on Barrages EEs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 7:04 AM IST

Kaleshwaram Project Judicial Inquiry Updates : కాళేశ్వరం ఎత్తిపోతల ఆనకట్టలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ (పీసీ ఘోష్‌) నేతృత్వంలో న్యాయ విచారణ కొనసాగుతోంది. ఓవైపు కమిషన్ బ్యారేజీలను పరిశీలిస్తూనే, మరోవైపు ఇందుకు కారణమైన బాధ్యులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ)లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్‌సింగ్‌లను విచారించనుంది. ఆనకట్టలకు సంబంధించిన పలు అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. హైదరాబాద్‌లోని కమిషనర్‌ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది.

Kaleshwaram Barrages Issue Updates : తెలంగాణ సర్కార్ సూచించిన టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లోని ప్లానింగ్, డిజైన్స్, కన్‌స్ట్రక్షన్‌లతోపాటు అనేక ఇతర అంశాలపై ముగ్గురు ఈఈలు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్‌సింగ్‌లను విచారించనున్నారు. టెయిల్‌ వాటర్, షూటింగ్‌ వెలాసిటీ(ఆనకట్ట నుంచి దిగువకు నీటి విడుదల సమయంలో పడే దూరం) అంశాలపై ప్రశ్నించనుంది. బ్యారేజీల నుంచి సెకనుకు 4.8 నుంచి 5 మీటర్ల వరకు షూటింగ్‌ వెలాసిటీ ఉండాల్సి ఉంది. దీనికి భిన్నంగా 16 నుంచి 18 మీటర్ల వరకు వస్తోంది. ఈ తేడాలతో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, నిర్మాణాలు దెబ్బతినడం వంటివి సంభవిస్తున్నాయి. ఆనకట్టలో ఇసుక పేరుకుపోవడం, నిర్మాణ సంస్థలు, నీటిపారుదలశాఖతో ఈఈలు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలపైనా కమిషన్‌ దృష్టిసారించనున్నట్లు తెలిసింది.

మేడిగడ్డ ఆనకట్టపై విచారణ ముమ్మరం - వర్షాకాలంలోపు చేయాల్సిన పనులపై కమిషన్ దృష్టి - JUDICIAL INQUIRY ON MEDIGADDA ISSUE

క్షేత్రస్థాయిలో సమాచారం మేరకు : ఇప్పటికే కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనూ సందర్శించారు. మూడో దఫాలో భాగంగా ఆయన శుక్రవారం అన్నారం, శనివారం సుందిళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత భారీ నిర్మాణాలు చేపడుతున్న సమయంలో కనీస బాధ్యత ఉండదా అంటూ ఇంజినీర్లపై, నిపుణులైన మీరు ఏ పని చేస్తున్నారో తెలుసుకోరా అంటూ నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ బ్లాక్స్, బుంగలు ఇతర లోపాలను నిశితంగా పరిశీలించి జస్టిస్ పీసీ ఘోష్ వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఈఈలను ఆయా అంశాలపై ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? : జస్టిస్‌ పీసీ ఘోష్‌ - Judicial Inquiry On Kaleshwaram

'వర్షాకాలం రాబోతుంది - మేడిగడ్డ బ్యారేజీకి ముప్పు రాకుండా కాపాడుకోండి' - Justice Ghose Suggestions Medigadda

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.