ETV Bharat / state

ప్రభుత్వ హామీతో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు - Telangana Juda Call off Strike

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 6:08 PM IST

Updated : Jun 26, 2024, 7:39 PM IST

T JUDA Decide to Call off Strike : రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీతో వారు సమ్మెను విరమించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, స్టైఫండ్ బకాయిలు వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిచండేతో వారు రేపటి నుంచి విధులకు హాజరుకానున్నారు.

T JUDA Decide to Call off Strike
T JUDA Decide to Call off Strike (ETV Bharat)

Telangana Junior Doctors Call off Strike : రాష్ట్ర ప్రభుత్వంతో జూడాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జూనియర్​ డాక్టర్లు సమ్మె విరమించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీతో జూడాలు సమ్మెను విరమించారు. 8 డిమాండ్లలో ఆరింటికి సానుకూలంగా మంత్రి స్పందించారు. మంత్రి సానుకూల స్పందనతో జూడాలు సమ్మెను విరమించారు. హైదరాబాద్​లో జూడాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ జూడాలు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి వసతి గృహాలపై ఫిర్యాదు చేశారని తెలిపారు. వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారన్నారు. తమకు మరింత భద్రత కల్పించాలని జూడాలు కోరారని వివరించారు. జూనియర్​ డాక్టర్లు లేవనెత్తిన సమస్యలపై సీఎం రేవంత్​ రెడ్డి స్పందించారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను సందర్శించామని వెల్లడించారు.

T JUDA Call off Strike : ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాల కోసం రూ.121 కోట్లు విడుదల చేశామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అలాగే గాంధీ ఆసుపత్రి కోసం రూ.80 కోట్లు మంజూరు చేశామన్నారు. కాకతీయ ఆసుపత్రికి సీసీ రోడ్డు మంజూరు చేశామని స్పష్టం చేశారు. వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

అలాగే ఉస్మానియా ఆసుపత్రి విషయం కోర్టులో ఉందని గుర్తు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు కట్టేందుకు తాము సిద్ధమన్నారు. ఉస్మానియా గురించి సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. పేదలకు వారివారి ప్రాంతాల్లోనే వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యశాఖ విధానాల్లో కూడా మార్పులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. పేదల ప్రజలకు విద్య, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఆసుపత్రుల్లో మంచి భోజనం అందించాలని ఆదేశించామన్నారు. డ్రగ్స్​, హెల్త్​ ల్యాబ్​లను ఆధునీకరిస్తున్నామని వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

"ఉస్మానియా మెడికల్​ కాలేజీకు సంబంధించి రూ.121 కోట్లును సౌకర్యాల కోసం విడుదల చేశాం. అదే విధంగా గాంధీ మెడికల్​ కాలేజీకి సంబంధించి రూ.80 కోట్లు మంజూరు చేయడం జరిగింది. కాకతీయ మెడికల్​ కాలేజీకి రూ.3.45 కోట్లు సీసీ రోడ్లు నిర్మాణానికి మంజూరు చేశాం. ఆసుపత్రుల్లో మంచి భోజనం అందిస్తాం. పేదల ప్రజలకు విద్య, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదే." - దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశాఖ మంత్రి

జూడాల సమ్మెకు తాత్కాలిక్ బ్రేక్ - హామీ మేరకు పలు జీవోలు జారీ చేసిన సర్కార్ - TG JUNIOR DOCTORS CALL OFF STRIKE

కళ్లకు గంతలతో జూడాల నిరసన - 24 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిక - junior doctors protest in Telangana

Last Updated : Jun 26, 2024, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.