Job Opportunities Abroad for Indian : కనీస విద్యార్హతలు, నైపుణ్యాలు, తగిన వయసు, అనుభవం ఉంటే చాలు ఉచిత వసతి, నెలకు రూ.లక్షల్లో జీతంతో విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ద్విచక్రవాహనం నడిపే లైసెన్సు ఉంటే చాలు చేతినిండా సంపాదించుకునే అవకాశాలు మెండు. మానవ వసరుల కొరత యువ జనాభా లేకపోవడంతో పలు దేశాలు నైపుణ్యం కలిగిన కొలువుల కోసం యువతకు ఆహ్వానం ఇస్తున్నాయి. కొన్ని దేశాలు వివిధ రంగాల్లో అవసరమైతే స్టయిఫండ్‌తో కూడిన అప్రెంటిస్ విధానం కింద అవకాశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోని తెలంగాణ ఓవర్‌సీస్ మ్యూన్‌పవర్ లిమిటెడ్ (టామ్‌కామ్) చట్టబద్ధంగా విదేశీ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఆ కారణంగానే ఉద్యోగ అవకాశాలు : టామ్‌కామ్ పరిధిలో గత రెండేళ్లుగా విదేశాల్లో కొలువులు అవకాశాలు పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు వయసు 45 ఏళ్లకు పైబడి ఉటోంది. మరికొన్ని దేశాల్లో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ కారణంగా విదేశాల్లో యువ కార్మికుల అవసరం పెరిగింది. జర్మనీలో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. జపాన్‌లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడ నర్సులు, వైద్యులు, చెఫ్ తదితర ఉద్యోగాలకు బాగా డిమాండ్ ఉంది. నైపుణ్యాలతో పనులు చేయగలిగిన సత్తా ఉంటే పలు దేశాలు నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వృద్ధుల సంరక్షణ ఉద్యోగాలకూ మంచి డిమాండ్ ఉంది. నర్సింగ్, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం అర్హతలు కలిగిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు - ఎవరెవరు అర్హులంటే
వాళ్లకి అవకాశాలు మెండు : విదేశీ కొలువుల్లో నేలకు కనీసం రూ.లక్షకు పైగా వేతనం వస్తోంది. ఇటీవల యూఏఈ డెలివరీ బాయ్స్‌గా పని చేసేందుకు బైక్ నడపడం వచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ కొలువుల కోసం ఇప్పటికే 45 మంది ఎంపికై వీసాలు పొంది అక్కడ కొలువు చేస్తున్నారు. నిర్మాణ రంగంలో, వృద్ధుల సంరక్షణ ఉద్యోగాలకు ఇజ్రాయెల్ దేశంలో మంచి ఉద్యోగావకాశాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రం నుంచి కొంతమంది అక్కడికి వెళ్లారు. యుద్ధం ముగిస్తే అక్కడ మరిన్ని కొలువుల అవకాశాలు పెరగనున్నాయి. పర్యటకం, అతిథ్య రంగంపై ఆధారపడిన గ్రీస్ కూడా నైపుణ్యం కలిగిన యువత కోసం టామ్‌కామ్‌పై ఆధారపడుతోంది. అర్హులైన వారి నుంచి టామ్‌కామ్ సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా అప్లికేషన్లు తీసుకుంటోంది.
- ఇజ్రాయెల్‌లో కేర్ గివర్స్ ఉద్యోగాలకు ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం చేసిన వారికి నెలకు రూ.1.3 లక్షల జీతం లభిస్తోంది.
- జర్మినీల నర్సులుగా పనిచేసేందుకు నెలకు రూ.2.5 లక్షల నుంచి రూ.3లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి.
- జపాన్‌లో ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం చేసిన వారిని రూ.1.2 నుంటి కూ.1.6 లక్షల వరకు వేతనాలు ఇస్తున్నారు.
- గ్రీస్‌లో అతిథ్య రంగంలో హౌస్‌కీపింగ్, వెయిటర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, మేస్త్రీ, గార్డెనర్, క్లీనర్, మేస్త్రీ ఉద్యోగాలు అవకాశాలున్నాయి. నెలకు రూ.88 వేల నుంచి రూ.1.2 లక్షలతో పాటు ఉచిత వసతి కూడా కల్పిస్తున్నారు.
- జర్మనీలో అక్కడి భాషపై నైపుణ్యం కలిగి ఇంటర్, హోటెల్ మేనేజ్‌మెంట్ చేసిన వారికి చెఫ్, బార్‌టెండర్, ఫ్రంట్ ఆఫీర్ రిసెప్షనిస్టు, హౌస్‌కీపింగ్ ఉద్యోగాలు లభిస్తున్నాయి.
ఆ '1' మార్కు - 4 ప్రభుత్వ ఉద్యోగాలను తెచ్చిపెట్టింది
డిగ్రీ, బీటెక్ అర్హతతో ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు - చివరి తేదీ ఎప్పుడంటే?