ETV Bharat / state

2,050 స్టాఫ్‌నర్సు పోస్టులకు నోటిఫికేషన్ - ఈనెల 28 నుంచి దరఖాస్తులు - TELANGANA STAFF NURSE NOTIFICATION - TELANGANA STAFF NURSE NOTIFICATION

Telangana Nursing Officer Notification 2024 : రాష్ట్ర వైద్యారోగ్య శాఖలోనూ కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

Nursing Officer Notification 2024
Telangana Nursing Officer Notification 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 1:01 PM IST

Telangana Nursing Officer Notification 2024 : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్‌ పరిధిలో 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు.

నవంబరు 17న నర్సింగ్‌ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ సహా 13 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.

గరిష్ఠ వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లు ఉండగా తాజాగా 46 ఏళ్లకు పెంచారు. గరిష్ఠ వయోపరిమితికి ప్రాతిపదిక తేదీ 2024 ఫిబ్రవరి 8. గరిష్ఠ వయోపరిమితిలో దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

జోన్లవారిగా ఖాళీలు : జోన్‌1- 241, జోన్‌2- 86, జోన్‌3- 246, జోన్‌4- 353, జోన్‌5- 187, జోన్‌6- 747, జోన్‌7-114 జోన్లవారిగా ఖాళీలు ఉన్నాయి.

సీఎం కార్యక్రమంలో స్టాఫ్​ నర్సుల ఆందోళన - రెగ్యులర్​ చేయాలని డిమాండ్

9 Medical Colleges opening Telangana 2023 : ఒకేరోజు.. 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.