ETV Bharat / state

పండుగ సీజన్​లో కొనుగోలు చేస్తున్నారా - ఐతే ఇవి మీ కోసమే!

పండుగల వేళ కొనుగోళ్లు జాగ్రత్త - సంస్థలు ఇచ్చే స్పెషల్​ ఆఫర్లు సరెండర్​ అయ్యారా? - క్రమశిక్షణ లేకపోతే ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Be careful when shopping during festivals
Be careful when shopping during festivals (ETV Bharat)

Be Careful When Shopping During Festivals : దసరా, దీపావళి.. ఈ వేడుకలంటేనే ఆనందం. ఏదో ఒక కొత్త వస్తువును కొనాలని అందరూ ఆలోచన చేస్తుంటారు. ఈ సమయంలో సంస్థలు ఇచ్చే ఆఫర్లు, రాయితీలు మనల్ని ఆకర్షిస్తుంటాయి. కొనుగోళ్ల విషయంలో కాస్త క్రమశిక్షణ గాడితప్పినా ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఒకప్పుడు పండగల సందర్భంలోనే ఎక్కువగా కొనుగోళ్లు ఉండేవి. ఇ-కామర్స్‌ కంపెనీల రాకతో ఇది మారిపోయింది. ఇక్కడ ఏడాదంతా ఏదో ఒక డిస్కౌంట్​ లభిస్తూనే ఉంటుంది. కొత్త కొత్త వస్తువులు సరికొత్త ఆఫర్లలో కనిపిస్తూనే ఉంటాయి. దీంతో కొనుగోళ్ల తీరు పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ పండగలప్పుడు అధిక మొత్తంలో కొనడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి టైంలో కాస్త అప్రమత్తంగా ఉంటే, మిగతా ఏడాదంతా ఆనందంగా ఉండొచ్చు.

బడ్జెట్‌ను సిద్ధంగా..

కొనుగోళ్ల కోసం స్పెషల్​గా ఒక బడ్జెట్‌ను కేటాయించుకోవాలి. ఇందులోనే జర్నీలకు సంబంధించిన ఖర్చులూ ఉండాలి. ప్రతి అంశానికీ ఎంత మేరకు ఖర్చు చేయాలన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి. చివరి నిమిషంలో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు. కానీ, ఇది 5 నుంచి 10 శాతానికి మించి పెరగకూడదు. మరో ప్రధాన విషయం ఏమిటంటే.. పండగల కోసం ముందునుంచే కొంత మొత్తాన్ని పొదుపు చేసి పెట్టుకోవడం వల్ల చివరి నిమిషంలో ఆర్థిక ఒత్తిడి లేకుండా చూసుకోవచ్చు. వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే సంసిద్ధం కావడం అన్నమాట.

ఆన్‌లైన్‌ చెల్లింపులతో

కొనుగోళ్లు ఎక్కువగా చేసేందుకు ఆన్‌లైన్‌లో చెల్లించడమూ ఒక కారణమని రిపోర్టులు చెబుతున్నాయి. యూపీఐ పేమెంట్స్​, క్రెడిట్‌ కార్డులకూ పరిమితులు విధించుకోండి. ఎంత వరకూ ఖర్చు చేయాలో అంతే మొత్తం సంబంధిత అకౌంట్​లో ఉండేలా చూసుకోండి. టెంపరరీగా క్రెడిట్‌ కార్డులను బ్లాక్‌ చేయండి. యూపీఐ అనుసంధానించిన బ్యాంకు అకౌంట్​లను తొలగించండి. దీనివల్ల ఖర్చులను కొంతమేర అరికట్టేందుకు వీలవుతుంది.

ఎమెర్జెన్సీ ఫండ్​ను వాడొద్దు..

వేడుకల వేళ కొనుగోళ్ల కోసం అత్యవసర నిధిని (ఎమెర్జెన్సీ ఫండ్) వాడకుండా చూసుకోండి. ఇది అత్యవసరాల కోసం ఉపయోగించుకునేదని అసలు మర్చిపోవద్దు. మీ పండగ ఖర్చులు మీ బడ్జెట్‌ను మించిపోతే, కొనుగోళ్లను తాత్కాలికంగా పోస్ట్​పోన్​ వేసుకోవడమే ఉత్తమం.

ముందుగానే ప్లాన్​ చేసుకోవాలి

ఎలక్ట్రికల్ ఉపకరణాలు, దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోలును పండగల ముందే చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు మూడు నెలల ముందు నుంచే చాలా రకాల ఆఫర్లు కనిపిస్తున్నాయి. నెలనెలా కొంత సొమ్మును ఈ కొనుగోళ్ల కోసం వినియోగించుకోవచ్చు. దసరా, దీపావళి సందర్భంలో వచ్చిన బోనస్‌లాంటి వాటిలో 40 శాతానికి మించి కొనుగోళ్లకు వాడకుండా పరిమితి విధించుకోవాలి. మిగతా 60 శాతం మొత్తాన్ని తప్పకుండా దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో మదుపు చేయడం మంచిది.

పండగ వేళ ఆన్​లైన్ సేల్స్ జోరు- వారంలోనే రూ.54వేల కోట్ల ఆర్డర్స్​ - Festive Season Online Sales

'డిస్కౌంట్​' అనగానే క్లిక్​ చేస్తున్నారా? - 'బుక్' అయిపోతారు జాగ్రత్త - How to Avoid Online Shopping Frauds

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.