ETV Bharat / state

కరవు తీరేలా కృష్ణమ్మ పరవళ్లు - నాగార్జునసాగర్​ 16 గేట్లు ఎత్తి నీరు విడుదల - NAGARJUNA SAGAR 16 GATES LIFTED - NAGARJUNA SAGAR 16 GATES LIFTED

Nagarjuna Sagar Dam Gates Opened Today : ఎట్టకేలకు నాగార్జునసాగర్​ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో నిండుకుండలా మారిన సాగర్ డ్యామ్ నీటిని, ఇవాళ ఉదయం అధికారులు తొలుత ఆరు గేట్లను ఎత్తి దిగువకు వదిలారు. క్రమక్రమంగా గేట్ల సంఖ్యను పెంచుతూ వెళ్లారు. సాయంత్రం అయ్యేసరికి మొత్తం 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్​ చేశారు.

Nagarjuna Sagar Dam Gates Opened
Nagarjuna Sagar Gates Opened Today (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 11:29 AM IST

Updated : Aug 5, 2024, 9:59 PM IST

Nagarjuna Sagar Ten Gates Opened Today : కరవు పరిస్థితుల నేపథ్యంలో గతేడాది వెలవెలబోయిన నాగార్జునసాగర్‌, ప్రస్తుతం నిండుకుండలా మారి కలకలలాడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం పోటెత్తుతుండటంతో అధికారులు 16 గేట్లు ఎత్తారు. తొలుత 6 గేట్లను ఎత్తిన అధికారులు క్రమంగా 16 గేట్లను తెరిచారు.

ముందుగా నాగార్జునసాగర్​ ఎస్​ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్​ కుమార్​ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, ఆరు రేడియల్​ క్రస్ట్​ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం మరో పది గేట్లను క్రమక్రమంగా ఎత్తారు. అంతకుముందు దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్​ను మోగించారు. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు రావడంతో ఇవాళ గేట్లు ఓపెన్ చేశామని నాగార్జునసాగర్ ఎస్ఈ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తిన అధికారులు : మొత్తం పదహారు క్రస్టు గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వరద నీరు ఫ్లో ఆధారంగా మరిన్ని గేట్లు ఓపెన్ చేస్తామన్నారు. సాగర్‌ గేట్లు తెరుచుకోవడంతో, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 22 లక్షల ఆయకట్టు సాగులోకి వస్తోంది. సాగర్ సోయగాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది.

పోటెత్తుతున్న వరద : ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ​ప్లో 3,23,969 క్యూసెక్కులు ఉండగా, 1,63,691 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 584.40 అడుగులకు చేరింది. 312.50 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్ధ్యానికి ప్రస్తుత నీటి నిల్వ 294.70 టీఎంసీలు ఉంది. మొత్తం పదహారు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.

గత రెండేళ్ల నుంచి సాగర్ జలశయానికి వరద ప్రవాహం లేకపోవడంతో మేజర్‌ కాల్వలను అధికారులు నిర్లక్ష్యం చేశారు. దీంతో సాగర్ కుడి, ఎడమ కాల్వలు నుంచి మేజర్‌ కాల్వలకు వెళ్లే ప్రధాన కాల్వలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కాలువ కట్ట లైనింగ్ సరిగా లేదు. మరికొన్ని చోట్ల కాల్వ లైనింగ్ పనులు జరగకపోవడంతో పగుళ్లు ఏర్పడి రాళ్లు పైకి తేలి నిర్జీవంగా ఉంది. దీంతో పూర్తి సామర్థ్యం మేర నీటిని విడుదల చేయకుండా, కొద్ది కొద్దిగా మేజర్ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు.

కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎగువన కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దఎత్తున వరద పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయానికి సుంకేశుల, జూరాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో, 10 గేట్లను ఎత్తి నీటిని దిగువన ఉన్న నాగర్జునసాగర్​కు విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లవద్దని, పశువులను నదిలోకి తీసుకెళ్లడం లాంటివి చేయవద్దని అధికారులు హెచ్చరించారు. ఇన్‌ఫ్లో ఆధారంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఏటా ఆరున్నర లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు సృష్టిస్తాం : ఉత్తమ్‌ - Uttam Released Sagar Water

శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు - కృష్ణమ్మకు జలహారతి - Chandrababu Jala Harathi Srisailam

Last Updated : Aug 5, 2024, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.