ETV Bharat / state

అతివేగంతో నెత్తురోడుతున్న రోడ్లు - గాల్లో కలుస్తున్న ప్రాణాలు - High Speed Injurious to Life - HIGH SPEED INJURIOUS TO LIFE

India Road Accidents Death Toll : ఉరుకుల పరుగుల జీవితంలో హడావుడి ప్రయాణాలే ఎక్కువ. ఆఫీస్‌కు ఆలస్యం అవుతుందని, సమయానికి గమ్య స్థానం చేరుకోవాలని వేగాన్ని అతిక్రమించి మరీ వాహనాలు నడుపుతుంటారు చాలామంది. కానీ, ఆ అతివేగమే ప్రాణాలు హరిస్తుందనే ప్రాథమిక అంశాన్ని ఎవరూ గుర్తెరుగరు. గుర్తించినా లెక్కచేయరు. ఫలితంగా కళ్లు మూసి తెరిచేలోగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారు, గాయపడుతున్న వారు వేలల్లోనే ఉన్నారు. ఓ విధంగా రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయే, కానీ, తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగానూ రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది. మరి, ఈ అతివేగం విషయంలో నిర్లక్ష్యం ఎందుకు. దేశంలో రోడ్డు భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి.? ప్రయాణాలు చేసేటప్పుడు వాహన చోదకులు పాటించాల్సిన ప్రమాణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

High Speed Injurious to Life
India Road Accidents Death Toll (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 4:44 PM IST

అతివేగంతో నెత్తురోడుతున్న రోడ్లు - గాల్లో కలుస్తున్న ప్రాణాలు (ETV Bharat)

Road Accidents Increasing Day by Day More : వాహన వేగం ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆయుర్ధాయాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. తొందరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో వేగంగా వెళ్లి చాలా మంది ప్రాణాల మీదికు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఉదంతాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

అతివేగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 11,90,000 మరణాలు సంభవిస్తున్నాయి. సుమారు 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది తీవ్రంగా గాయపడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా రోడ్డు ప్రమాదాలలోనూ అగ్రస్థానంలో ఉంది. అక్కడ రోజుకు 19,937 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అమెరికా కథనాలు తెలిపాయి.

High Speed Injurious to Life : జపాన్‌ కూడా ఇదే బాటలో నడుస్తోంది. కాగా నార్వే, స్వీడన్‌ వంటి దేశాల్లో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ దేశాల్లోని డ్రైవర్లు రోడ్డు నియమనిబంధనలు పాటించడం, రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడం వల్లనే ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయి. భారత్‌లోనూ రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా సగటున ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో 19మంది మృత్యువాత పడుతున్నారని వివరించింది. సంవత్సరానికి దాదాపు లక్షా 68వేల నిండు ప్రాణాల్ని ప్రమాదాలు కబళిస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రహదారులు నెత్తురోడటానికి, రెప్పపాటులో మృత్యువు కాటేయడానికి ముఖ్యకారణం అతివేగమే కారణమని చాలా నివేదికలు చెబుతున్నాయి.

మానవ తప్పిదాలే అధిక రోడ్డు ప్రమాదాలకు కారణం : అతివేగంతో పాటు వాహనం తోలుతూ ఫోన్‌లో మాట్లాడటం, వీడియోలు చూడటం, మద్యం మత్తు, నిద్రలేమి వంటివి నడిరోడ్డుపై మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. 2030 సంవత్సరం నాటికి దేశంలో జరుగుతున్న ప్రమాదాలను సగం వరకు తగ్గిస్తామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పలు సందర్భాల్లో ప్రకటించారు.

ఇప్పటికే రష్యా, జపాన్, నార్వే, డెన్మార్క్‌ వంటి దేశాలు రోడ్డు ప్రమాదాల్లో అరికట్టడంలో నూతన పద్ధతులు ‌అవలంబించి సగానికి పైగా ప్రమాదాలను తగ్గించాయని నిపుణులు చెబుతున్నారు. మరో 35దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఆయా దేశాలన్నీ విజన్‌ జీరో పేరుతో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అడుగులేస్తున్నాయి.

India Road Accidents Death Toll : విజన్‌ జీరోను మొదటిసారిగా 1997లో స్వీడన్‌ ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా తక్కువ ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2050నాటికి తమ రోడ్లపై మరణాల్ని, తీవ్ర గాయాల్ని సున్నా స్థాయికి చేర్చాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్‌ ప్రభుత్వాలు రహదారి ప్రమాద కారకుల జరిమానాలు విధించి ప్రమాదాలు తగ్గించే పనిలో పడ్డాయి.

జర్మనీలో పౌరులు ట్రాఫిక్‌ ఉల్లంఘనల్ని లెక్కించి ఒక దశ దాటాక లైసెన్సును రద్దు చేసే కంప్యూటరైజ్డ్‌ విధానం అమలవుతోంది. ఇంకా చాలా దేశాలు అతివేగాన్ని గుర్తించడానికి స్పీడ్‌ కెమెరాల్ని వినియోగిస్తున్నాయి. ఈ తరహా పద్ధతులను పాటించే రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా అడుగులేస్తామని కేంద్రం చెప్తున్నప్పటికి వాటి అమలుకు ఎంత సమయం పడుతుందనే విషయంలో స్పష్టత లేదు.

వాహన వేగాన్ని తగ్గించేందుకు మోటార్‌ వెహికిల్‌ చట్టం అమలు : వేగంగా వాహనాలు నడిపి ప్రాణాల కోల్పోతున్న వారి సంఖ్య తగ్గించడానికి మోటర్‌ వెహికిల్‌ 1988 చట్టాన్ని 1989లో నాటి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ప్రతి వాహనాదారుడు ట్రాఫిక్‌ రూల్స్ పాటించాలని చెప్పింది. వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో 1939 చట్టం కింద ఇన్సూరెన్స్‌ చేయించకోవడం తప్పనిసరి అని పేర్కొంది.

15 సంవత్సరాలు దాటిన వాహనాలను కాలం చెల్లిన వాటివిగా గుర్తించి వాటిని రోడ్లపైకి తీసుకొస్తే చర్యలు ఉంటాయని చట్టంలో ఉంది. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం వేగంగా వాహనాలు నడిపినట్లు పోలీసులు గుర్తిస్తే నెలరోజుల జైలు శిక్షతో పాటు రూ.500 నుంచి 10 వేలు వరకు జరిమానా విధిస్తున్నారు.

Government Severe Action on Careless Driving : మోటార్‌ వెహికిల్ చట్టం 1988లోని సెక్షన్‌ 185 ప్రకారం డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మానవ శరీరంలోని 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిల్లి గ్రాముల ఆల్కహల్‌ శాతం ఉందని పోలీసులు గుర్తిస్తే ఎలాంటి అరెస్టు వారెంటు లేకుండా సదరు డ్రైవరును అదుపులోకి తీసుకుని 6 నెలల జైలు శిక్షతో పాటు 10 వేల వరకు జరిమానా విధించవచ్చు. కానీ, మోటార్‌ వెహికిల్‌ 1989 చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు, ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

రో‌డ్డు ప్రమాదాలు జరగకుండా వివిధ దేశాలలోని పద్ధతులను అనుసరిస్తూనే ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అందుకోసం మెరుగైన కార్యాచరణను రూపొందించుకోవాలి. వీటితో పాటు రహదారి నిర్మాణంలో డిజైన్ల లోపాలు గుర్తించి గుత్తేదారుల పట్ల చర్యలు తీసుకోవాలి. జాతీయ రహదారులపై గుంతలు లేకుండా చూసుకోవాలి. వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘించినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలి.

Road Safety Standards : పాఠశాల స్థాయిలోనే రోడ్డు భద్రత, రోడ్డు నియమాల గురించి బోధించాలి. వేగం కన్నా ప్రాణం మిన్న అనే విషయాన్ని పిల్లలకు పాఠాశాల స్థాయిలోనే వారి మెదళ్లలోకి ఎక్కించాల్సిన అవసరం చాలా మేరకు ఉంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా మొదటి బాధ్యత వాహనదారులదే. కారు నడిపేటప్పుడు తప్పని సరిగా సీట్‌ బెల్ట్ పెట్టుకోవాలి.

భద్రతా ప్రమాణాలు కలిగిన వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికప్పుడు వాహన సామర్థ్యాన్ని చెక్‌ చేసుకోవాలి. దూర ప్రాంతాలకు వెళ్లెటప్పుడు అక్కడి రోడ్లు ఏ విధంగా ఉంటాయో ముందే తెలుసుకోవాలి. రాత్రి ప్రయాణాలు తగ్గించాలి. ఎందుకంటే ఎక్కువగా నిద్రలోకి జారుకుని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్‌ సిగ్నల్స్ గురించి తెలుసుకోవాలి.

ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించాలి. జాతీయ రహదారులపై వెళ్లేటప్పుడు కూడా కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని తప్పని సరిగా పాటించాలి. డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయకూడదు. వాహనం వేగం అదుపులో ఉండాలి. స్పీడ్‌ లిమిట్స్‌ను పాటించాలి. ఇవన్నీ పాటిస్తేనే సురక్షితంగా గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోగలమని వాహనరంగ నిపుణులు చెబుతున్నారు.

మీరు టూ-వీలర్స్​ నడుపుతుంటారా? ఈ టాప్​-10 రోడ్ సేఫ్టీ టిప్స్ మీ కోసమే! - Road Safety Tips For Bike Riders

కొత్తగా కార్​ డ్రైవింగ్​ నేర్చుకుంటున్నారా? ఈ అడ్వాన్స్​డ్​​ సేఫ్టీ ఫీచర్ల గురించి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.