T20 World Cup Victory Celebrations In TG : టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. త్రివర్ణ పతాకాల్ని పట్టుకుని ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
CM Revanth congratulated Team India : టీ20 ప్రపంచకప్ విజయంపై టీమ్ ఇండియాకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. క్రికెట్ ప్రపంచంలో భారత్‌కు ఎదురులేదని మరోసారి నిరూపించారన్నారు. రోహిత్ సేన దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది సీఎం కొనియాడారు. భారత జట్టు సంచలన ప్రదర్శన చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. విరాట్‌కోహ్లి బౌలర్లందరూ అధ్భుతంగా పని చేశారన్నారు. వంద కోట్ల మంది హృదయాలను సంతోషపెట్టినందుకు టీమ్ ఇండియాకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
క్రికెట్ అభిమానుల సంబురాలు : క్రికెట్ అభిమానులతో సచివాలయ ప్రాంతం నిండిపోయింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అభిమానులు చేరి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి కేరింతలు కొడుతూ చిందులేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా యువతి, యువకులు రోడ్ల పైకి సందడి చేశారు. అబిడ్స్, చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కూకట్ పల్లి, మాదాపూర్, పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. ర్యాలీలుగా సాగుతూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు.
చైతన్యపురిలో క్రికెట్ అభిమానుల సంబురాలు : టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటి కప్‌ను కైసవం చేసుకోవడంపై చైతన్యపురిలో క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. యువత భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఇండియా ఇండియా అంటూ హుషారుగా నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జాతీయ జెండాలు పట్టుకుని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చైతన్యపురి నుంచి దిల్సుఖ్నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కూకట్పల్లి ప్రాంతంలోనూ క్రీడాభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆటగాళ్ల క్రీడాప్రతిభను ప్రశంసిస్తూ వారికి జేజేలు పలుకుతూ కేరింతలు కొట్టారు.
17ఏళ్ల నిరీక్షణకు తెర - విశ్వవిజేతగా భారత్ - T20 WORLD CUP 2024 FINAL
దంచికొట్టిన విరాట్, అక్షర్- సౌతాఫ్రికా టార్గెట్ 177 - T20 World Cup 2024