ETV Bharat / state

ట'మాటల్లేవ్‌' - సెంచరీ కొట్టిన ధర - TOMATO PRICES IN TELANGANA - TOMATO PRICES IN TELANGANA

కొండెక్కిన టమాట ధరలు బహిరంగ మార్కెట్‌లో రూ.80 నుంచి రూ.100కు విక్రయం - డిమాండ్‌కు తగ్గ దిగుబడి లేకపోవడమే ఈ పరిస్థితి కారణమంటున్న వ్యాపారులు

TOMATO RATES INTG
TOMATO PRICES INCREASED IN TELANGANA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 2:48 PM IST

Tomato Price Hike in TG : రాష్ట్రంలో టమాటా ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో రూ.80 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ధర మరింత పెరగవచ్చనే వాదన వినిపిస్తోంది. డిమాండ్‌కు తగ్గ దిగుబడి లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని వ్యాపారులు అంటున్నారు. అమాంతం ధరలు పెరిగిపోవడంతో కొనేందుకు వినియోగదారులు జంకుతున్నారు. మరోవైపు రైతు బజార్లలో ధరలకు రిటైల్‌ మార్కెట్‌ ధరలకూ భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో ఈ విషయంపై కూడా చర్చనడుస్తోంది.

ప్రస్తుతం మార్కెట్​కు గతంతో పోల్చితే సగం సరుకే దిగుమతి అవుతోంది. ధర తక్కువగా ఉన్నప్పుడు 30 టన్నుల టమాట వచ్చేది. ప్రస్తుతం 15 నుంచి 18 టన్నులు మాత్రమే వస్తోంది. పెద్ద రైతుబజార్లకు రోజుకు టన్ను, చిన్నవాటికి 50 క్వింటాళ్లు అవసరం కాగా ప్రస్తుతం అందులో సగం మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో టమాటా కేజీ రూ.17-రూ.18 ఉంది. ప్రస్తుతం రాయితీ టమాటానే రైతుబజార్లలో రూ.58కు అమ్ముతున్నారు. బహిరంగ మార్కెట్‌లో నాణ్యత ఆధారంగా కేజీ రూ.90 నుంచి రూ.100 వరకు ధర పలుకుతోంది.

రాయితీ విక్రయాలు ప్రారంభం : ఏపీలోని రాజమహేంద్రవరం రైతుబజార్లలో రాయితీ టమాట అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఒక్కో రైతుబజారుకు 20 నుంచి 40 ట్రేలను సరఫరా చేస్తోంది. ఇందుకు కేజీ రూ.58గా ధర నిర్ణయించారు. గత రెండు రోజుల నుంచి ప్రతి రోజూ రైతుబజార్లకు రాయితీ టమాట సరఫరా అవుతోందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.

Rising in Tomato Prices : మరోవైపు రైతుబజార్లలో వ్యాపారులు కిలో టమాటా ఏకంగా రూ.100కు విక్రయించారు. అవి కూడా చిన్న సైజువే కావడం గమనార్హం. భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడులు తగ్గడమే ధర పెరగడానికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. గత వారం కిలో రూ.50కే విక్రయించేవారు. క్రమేపీ రూ.70, రూ.80 చొప్పున పెరుగుతూ వందకు ఎగబాకింది.

డిసెంబర్ నుంచి టమాట పంట దిగుబడి వస్తుందని, అప్పటికీ ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. దొండకాయలు గతంలో కేజీ రూ.20కి విక్రయించేవారు. ఇప్పుడు రూ.60కి పెరిగింది. బీరకాయలు కిలో రూ.70 కంటే తగ్గడం లేదు. హైబ్రిడ్‌ మునగకాడ రూ.20 చెబుతున్నారు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప ధరలు నిలకడగానే ఉన్నాయి.

Onions Price in Telangana : ఉల్లి ధరలకు రెక్కలు.. వినియోగదారులకు చుక్కలు

కొండెక్కి రూ.100పై కూర్చున్న టమాట - నూనెలు, పప్పు దినుసులతో సై అంటే సై! - Tomato Price Hike In Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.