ETV Bharat / state

కూరగాయలే కాదు పూలు కొనలేకపోతున్నాం - సప్లయ్ తగ్గి ఆకాశాన్నంటిన ధరలు - GUDI MALKAPUR FLOWER MARKET

హైదరాబాద్​లోని గుడిమల్కాపూర్​ పూల మార్కెట్​లో బంతి, చామంతి పూల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. బతుకమ్మ పండుగకు పూల అవసరం ఉండటంతో విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది.

GUDI MALKAPUR FLOWER MARKET
FLOWERS PRICES INCREASED (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 4:32 PM IST

Updated : Oct 9, 2024, 5:14 PM IST

Flowers Prices Increased in Hyderabad: బతుకమ్మ, నవరాత్రుల సందర్భంగా పూల మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. సింగిడి ఆరబోసినట్లు రంగురంగుల పూలు కనువిందు చేస్తున్నాయి. బంతి, చామంతి, గులాబీ వంటి రకరకాల పూలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. పూలను కొనుగోలు చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. గత వారం రోజుల కిందట తక్కువ ధర పలికిన పూలకు ఇప్పుడు రెక్కలు వచ్చాయి. దీంతో కొనుగోలుదారులు నివ్వెరపోతున్నారు.

రాష్ట్రంలోని పూల మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌ కొనుగోలుదారులతో రద్దీగా మారింది. రేపు సద్దుల బతుకమ్మతో పాటు నవరాత్రుల సందర్భంగా పూలను కొనుగోలు చేసేందుకు తెల్లవారు జాము నుంచే పెద్దఎత్తున జనాలు మార్కెట్లకు తరలివెళ్లి పూలు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా పూలకు డిమాండ్‌ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల కిందట గరిష్ఠంగా రూ. 30 పలికిన పూల ధరలు అమాంతం రూ.100 నుంచి రూ.200లకు పెరగడంతో జనాలు, కొనుగోలుదారులు నిర్ఘాంతపోతున్నారు.

సాధారణంగా పెళ్లిళ్లకు సంబంధించిన ఆర్డర్లు తరచు ఉంటాయని, కానీ పండుగ కావడంతో జనాలు సైతం మార్కెట్​కు పెద్ద సంఖ్యలో వచ్చేసరికి పూలకు డిమాండ్​ అధికంగా పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం : ఇతర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా రాష్ట్రానికి పూల దిగుమతి తగ్గిపోవడం పండుగల సందర్భంగా పూల కొనుగోలు పెరగడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని విక్రయదారులు అంటున్నారు. హైదరాబాద్​లోని హోల్ సేల్ పూల మార్కెట్​లకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పూలు దిగుమతి అవుతుంటాయి. పండుగ వేళ రాష్ట్రంలోని పూల మార్కెట్​లు కళకళలాడుతున్నాయి. గుడిమల్కాపూర్​ పూల మార్కెట్​కు దేశవాళీ హైబ్రిడ్​కు చెందిన వివిధ రకాల పూలు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటాయి.

మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి హైబ్రిడ్ బంతి, చామంతి, గులాబి తదితర పువ్వులు రవాణా చేసుకుంటున్నామని విక్రయదారులు తెలిపారు. ఇతర రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నందు వల్లే పూల దిగుమతి తగ్గిందని, దాని కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే విధంగా రవాణా ఖర్చులు ఎక్కువ అవ్వడంతో గిట్టుబాటు ధర లేకపోవడంతోనే ధరల పెరుగుతున్నాయన్నారు. మరోవైపు పండుగలకు తోడు పెళ్లి ముహూర్తాలు ఉండడంతో పూలకు డిమాండ్‌ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. కొద్దిరోజుల్లో మళ్లీ ధరలు సాధారణ స్థితికి వస్తాయని చెబుతున్నారు.

ఈసారి గతంలో కంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి. జనం కూడా బాగా వచ్చాయి. ఇక్కడ చాలా వెరైటీలు దొరుకుతాయి కానీ ధరలు మాత్రం చాలా పెరిగాయి. సప్లయ్ తగ్గిందని ధరలు పెరిగాయని చెబుతున్నారు - కొనుగోలుదారులు

ఇతర రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నందున సరుకు తక్కువ వచ్చింది. బెంగళూరు, మహారాష్ట్రలో బాగా వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల తెలంగాణలో మన పూల ధరలు పెరిగాయి. వర్షాలు పడటం వల్లే ఒక్కసారిగా ధరలు పెరిగాయి - పూల వ్యాపారి

12ఏళ్ల తర్వాత విరబూసిన నీలకురింజి పువ్వులు- చూసేందుకు రెండు కళ్లు చాలవ్​! - Neelakurinji Flowers

అద్భుతం - ఒకే చెట్టుకు విరబూసిన 20 బ్రహ్మ కమలాలు - 20 Brahma Kamalam Flowers at a Time

Last Updated : Oct 9, 2024, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.