Temperatures Rises in Telangana : రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణ ఉష్టోగ్రతల కంటే ఎక్కువ డిగ్రీలు నమోదవుతున్నాయి. మండుటెండలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ ఒకటి, రెండు తేదీల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటో తేదీన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
తెలంగాణలో భానుడి భగభగ - కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జూస్లతో చలచల్లగా - Demand For Fruit Juices In Summer
Heat Waves in Telangana : రెండో తేదీన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీస్తాయని స్పష్టం చేసింది. ఇవాళ ఆదిలాబాద్ 43.3, నల్గొండ జిల్లా నాంపల్లి 43, గద్వాల్ 42.8, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం దనొరా 42.7, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 42.7,వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కన్నాయిపల్లి 42.6, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మరియాలలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధూరు 42.5, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి 42.5, నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కిష్టంపల్లి 42.4, ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది.
క్రమసంఖ్య | ప్రాంతం | నమోదైన ఉష్ణోగ్రత(సెల్సియస్‌లలో) |
1 | ఆదిలాాబాద్ | 43.3 |
2 | నాంపల్లి, నల్గొండ జిల్లా | 43 |
3 | గద్వాల్ | 42.8 |
4 | దనొరా, ఆసిఫాాబాద్ జిల్లా | 42.7 |
5 | కేతిరెడ్డిపల్లి, రంగారెడ్డి జిల్లా | 42.7 |
6 | కన్నాయిపల్లి, వనపర్తి జిల్లా | 42.6 |
7 | మరియాల, యాదాద్రి జిల్లా | 42.6 |
8 | గోధూరు, జగిత్యాల జిల్లా | 42.5 |
9 | కోరట్‌పల్లి, నిజామాబాద్ జిల్లా | 42.5 |
10 | కిష్టంపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా | 42.4 |
11 | గుబ్బగుర్తి, ఖమ్మం జిల్లా | 42.4 |
La Nina Effect In India : మరోవైపు దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లా నినా పరిస్థితులు మాత్రం వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా. ఇదిలా ఉంటే, ఏప్రిల్ లేదా మేలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం వల్ల ఐండీ వాతావరణ హెచ్చరికలతో అటు రాజకీయ నాయకులు, ఇటు ఓటర్లు ఇప్పటి నుంచే ఎండలకు జంకుతున్నారు.
అసలు ఏంటీ ఎల్ నినో?
ఎల్ నినో- పసిఫిక్ మహా సముద్ర జలాల్లో తలెత్తే ఓ సహజ పరిణామం. ఇది తాత్కాలికమైనదే అయినా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. దీని మూలంగా సంభవించే కరవులు, వరదలు, వడగాలుల వంటి వాతావరణ మార్పులు ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగవచ్చని అమెరికాకు చెందిన డార్ట్‌మౌత్ కాలేజ్ చేసిన ఓ అధ్యయనం ఇదివరకే హెచ్చరించింది. ఇప్పటికే మానవ చర్యల కారణంగా పెరుగుతున్న భూతాపంతో సతమతమవుతున్న తరుణంలో ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది.
ఆరంభంలోనే భగ్గుమంటున్న భానుడు -వేసవిలో ఆరోగ్యం కాపాడుకునేదెలా! - SUMMER Health Tips
వేసవిలో ఫ్రిజ్ నీళ్లు తాగితే - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - HEALTH PROBLEMS WITH FRIDGE WATER