ETV Bharat / state

గతేడాది కంటే మెరుగైన వర్షాలు - జూన్‌ 8-11 మధ్య తెలంగాణకు నైరుతి రుతుపవనాలు - Monsoon Prediction 2024 IMD - MONSOON PREDICTION 2024 IMD

IMD Monsoon Prediction in Telangana 2024 : రాష్ట్రంలో గతేడాది కంటే ఈ సంవత్సరం మెరుగైన వర్షాలుంటాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. జూన్‌ 8-11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశిస్తాయని భావిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు జూన్‌- సెప్టెంబరు నెలల మధ్య వానల ప్రభావంపై వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 9:36 AM IST

IMD Monsoon Prediction in Telangana 2024 : రాష్ట్రంలో గతేడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో తాగు, సాగు నీటికి కటకట పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు పంటలకు, నేలకు తేమను ఇచ్చే వర్షాలు (Rains in Telangana) అతి తక్కువగా పడటంతో భూగర్భ జలాలు అడుగంటాయి. తక్కువ వర్షాలు, వాటి మధ్య భారీ అంతరంతో తెలంగాణలో క్షామ పరిస్థితులు తలెత్తాయి. ఈ తరుణంలో ఈ సంవత్సరం వాతావరణ శాఖ తెలంగాణకు గుడ్‌ న్యూస్ చెప్పింది.

రానున్న వానాకాలంలో తెలంగాణ అంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, వరంగల్‌, హనుమకొండతోపాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని కొంత భాగంలో అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఈ మేరకు జూన్‌- సెప్టెంబరు నెలల మధ్య వర్షాల ప్రభావంపై మంగళవారం హైదరాబాద్‌ వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది.

తెలంగాణపై అలకబూనిన వర్షం - 305 రోజుల్లో వాన కురిసింది 66 రోజులే - low rainfall in telangana

Monsoon Forecast in Telangana 2024 : ఎల్‌ నినో పరిస్థితులు జూన్‌ నాటికి పూర్తిగా బలహీనపడతాయని వాతావరణ శాఖ నివేదికలో పేర్కొంది. లా నినా పరిస్థితులు జులైలో పుంజుకుంటాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు జూన్‌ 8, 11వ తేదీల మధ్య తెలంగాణలోకి ప్రవేశిస్తాయని భావిస్తున్నామని తెలిపింది. ఆ వెంటనే వానలు ప్రారంభమై జులైలో భారీ వర్షాలు నమోదవుతాయని వివరించింది. ఆగస్టులో సాధారణ రీతిలో కొనసాగుతూ తిరిగి సెప్టెంబర్‌లో అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ నివేదికలో వెల్లడించింది.

Rains in Telangana 2024 : గతేడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం, లెక్కకు మించి వానల విరామ కాలాలు నమోదవడంతో సాగుకు విఘాతం కలిగిందని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. దీంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు నిండుకుని క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఈసారి మాత్రం అలా ఉండదని వాతావరణశాఖ నిపుణులు సూచనలు చేస్తున్నారు.

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం : మరోవైపు దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం (Monsoon Prediction 2024 IMD) నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటు ఎల్‌పీఏతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. వచ్చే సీజన్‌లో ఎల్‌పీఏ 87 సెంటీమీటర్లగా అంచనా వేసింది.

లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్ట్- సెప్టెంబర్ నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వివరించింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌ నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్​లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

గుడ్ న్యూస్- ఈసారి నైరుతి రుతుపవనాలకు అన్నీ గ్రీన్ సిగ్నల్స్​! - Monsoon Forecast 2024 India

2024లో సాధారణ స్థాయిలోనే వర్షాలు- ఏపీ, తెలంగాణలో ఇలా! - Monsoon Prediction 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.