IG Ranganath Suspended Six Police Officers : మల్టీ జోన్ 1 పరిధిలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు పోలీస్ అధికారులను ఐజీ ఎ.వి రంగనాథ్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లు ఉన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌ను తప్పించెందుకే పంజాగుట్ట ఇన్స్పెక్టర్తో సంప్రదింపులు జరిపినట్లుగా హైదరాబాద్ సీపీ విచారణలో తేలింది. దీంతో అప్పటి బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. మద్యం సేవించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసిన నిజామాబాద్ జిల్లా సీసీఎస్ ఇన్స్పెక్టర్ యం.రమేష్‌ను సస్పెండ్ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై సస్పెన్షన్ వేటు : పట్టుకున్న గంజాయిని భద్రంగా దాచిపెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. వారి నిర్లక్ష్యంతో ఠాణాలో ఉన్న గంజాయిని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ చోటు చేసుకోగా బాధ్యులైన పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝలిపించారు. ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐజీ ఏవి.రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
Six Police Officers Suspended : ఆంధ్ర ప్రదేశ్ నుంచి నుంచి రాజస్థాన్‌కు అంబులెన్స్‌లో 70 కిలోల గంజాయి తరలిస్తుండగా గతేడాది ఫిబ్రవరిలో పట్టుకుని స్టేషన్ వెనుక వైపు అంబులెన్స్‌లో ఉంచారు. అంబులెన్స్‌లో గంజాయి ఉన్నట్లు గుర్తించిన దుండగులు పోలీసుల కళ్లుగప్పి ఈ నెల 1న అంబులెన్స్ అద్దాలు పగలగొట్టి గంజాయిని ఎత్తుకెళ్లారు పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో అప్పటి ఎస్ఐ జి.మనోహర్ రావు, ప్రస్తుత ఎస్సై ఎ.తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బి.రవిందర్ రెడ్డి ,కానిస్టేబుల్ టి. నరేందర్ ఉన్నారు. బాధ్యాతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులే ఇలా విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది.
వ్యక్తి హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం - పటాన్చెరు సీఐపై సస్పెన్షన్ వేటు