ETV Bharat / state

హైడ్రా దూకుడు - ఒకే రోజు మూడుచోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేత - hydra demolish illegal assets

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 10:20 AM IST

Updated : Sep 8, 2024, 4:40 PM IST

HYDRA Collapse Illegal Assets : హైదరాబాద్​లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వారాంతాల్లో దాడులను మరింత ఉద్ధృతం చేస్తోంది. ఇవాళ మూడు చోట్ల కూల్చివేతలు సాగించింది. మాదాపూర్​లోని సున్నం చెరువు, దుండిగల్​లోని కత్వా చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేసింది. అలాగే సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో అక్రమ నిర్మాణాలపైనా కొరడా ఝుళిపించింది.

HYDRA Collapse Illegal Assets
HYDRA Collapse Illegal Assets (ETV Bharat)

HYDRA Demolish Illegal Structures in Hyderabad : హైదరాబాద్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ అండ్​ అసెట్​ మానిటరింగ్​ అండ్​ ప్రొటెక్షన్​ బృందాలు హైదరాబాద్​ మహా నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తున్నాయి. మాదాపూర్​లోని సున్నం చెరువు ఎఫ్​టీఎల్​లో నిర్మించిన ఓ అపార్ట్​మెంట్​ను కూల్చివేసింది. దుండిగల్​ మల్లంపేట కత్వా చెరువులోని అనధికారిక విల్లాలను సైతం హైడ్రా నేలమట్టం చేసింది. ఎఫ్​టీఎల్​లో ఉన్న మూడు నిర్మాణాలు, బఫర్​ జోన్​లో ఉన్న 5 విల్లాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ అనధికారికంగా కత్వా చెరువులో నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు గత సోమవారం పరిశీలించారు.

మాదాపూర్​ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు : సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు. చెరువు ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. వీటిలో భారీ షెడ్స్​, భవనాలు ఉన్నాయి. వీటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. సున్నం చెరువు ఎఫ్​టీఎల్​లో ఉన్న సర్వే నంబర్లు 12,13,14,16లలో పదుల సంఖ్యలో షెడ్స్​ను నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీటన్నింటిపై హైడ్రా అధికారులు, స్థానిక రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో సున్నం చెరువు ఎఫ్​టీఎల్ పరిధిలో నిర్మిస్తున్నటువంటి నాలుగు అంతస్తులు, రెండు అంతస్తుల భవనాలు, ముప్పైకిపైగా షెడ్​లను అధికారులు నేలమట్టం చేసి పది ఎకరాల చెరువు భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

కత్వా చెరువులో నిర్మాణాలు కూల్చివేత : ఇదే రీతిలో దుండిగల్ కొత్వా చెరువు ఎఫ్​టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి పదకొండు డూప్లెక్స్ విల్లా భవనాలను అధికారులు తొలగించి రెండు ఎకరాల చెరువును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అలాగే మల్లంపేట్​ కత్వా చెరువు ఎఫ్​టీఎల్​ విస్తీర్ణం 142 ఎకరాలు. ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస కన్​స్ట్రక్షన్​ పేరుతో 2020-21 సంవత్సరానికే 320 విల్లాలను నిర్మించింది. అయితే వారు 60 విల్లాలకే హెచ్​ఎండీ పర్మిషన్​ తీసుకున్నారు. మిగతావి ఫోర్జరీ సంతకాలతో నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మేడ్చల్​ కలెక్టర్​ హరీశ్​ నేతృత్వంలో డీపీఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు అనుమతి లేవని నోటీసులు జారీ చేసి సీజ్​ చేశారు. వీటికి హైకోర్టు కరెంట్​ కనెక్షన్​, వాటర్​ కనెక్షన్​, రిజిస్ట్రేషన్​, బ్యాంక్​ అధికారులు లోన్​లను నిలిపివేయాలని ఆర్డినెన్స్​ ఇచ్చింది.

అమీన్​పూర్​లో హైడ్రా బుల్డోజర్​లు : మరో సంఘటనలో సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో హైడ్రా తమ బుల్డోజర్​ను రంగంలోకి దింపింది. పెద్ద చెరువు ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్​లో ఏర్పాటు చేసిన అక్రమ లేవుట్​కు సంబంధించిన ప్రహరీ గోడతో పాటు రెండు సెక్యూరిటీ గదులను అధికారులు తొలగించారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.

ముఖ్యంగా నగరవాసులు ఇకపై తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకొనే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వ్యహరించాలని ప్రధానంగా అపార్ట్​మెంట్లు, వ్యక్తిగత ఇళ్లు అలాగే స్థలాలు కొనుగోలు చేసే ముందు ఇవి ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ పరిధిలో వుందా లేదా అని ముందుగా ప్రజలు నిర్ధారించుకోవాలని హైడ్రా కమిషనర్ ప్రజలకు సూచించారు. అంతకముందు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు, మున్సిపాలిటీ రెవెన్యూ, పోలీస్​ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేశారు.

హైడ్రా దూకుడు- అమీన్​పూర్​లో అక్రమ కట్టడాల కూల్చివేత - Demolitions in Sangareddy

అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన వారిపై హైడ్రా చర్యలు - త్వరలోనే మరింత మందిపై కేసులు! - Hydra Registered Cases

Last Updated : Sep 8, 2024, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.