ETV Bharat / state

రాంనగర్‌లో హైడ్రా హడల్ - మణెమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - Hydra Demolitions in Ramnagar

Hydra Focus On Ramnagar Illegal Constructions : హైదరాబాద్​ పరిధిలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకుపడుతోంది. చెరువు పరిధిలో ఉన్నా, నాలాపై ఉన్నా రంగంలోకి దిగుతూ కూల్చివేతలకు తెగబడుతోంది. తాజాగా రాంనగర్‌లోని మణెమ్మకాలనీలో నాలాలపై నిర్మించిన నిర్మాణాలను ధ్వంసం చేసింది.

Hydra Demolition Illegal Constructions
Hydra Demolition Ramnagar Illegal Constructions (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 9:45 AM IST

Updated : Aug 30, 2024, 7:32 PM IST

Hydra Demolition Ramnagar Illegal Constructions : హైదరాబాద్‌లోని అడిక్‌మెట్‌ డివిజన్‌ రాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలకు దిగింది. మూడు ప్రత్యేక బృందాలుగా దాదాపు 70 మంది డీఆర్ఎస్ హైడ్రా కూల్చివేత ప్రత్యేక సిబ్బంది వచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. 1-9-18/9 సర్వే నెంబర్ గల స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా రోడ్డును కబ్జా చేసి, ఆ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు.

పరిశీలించిన రెండు రోజుల్లోనే నిర్మాణాలు కూల్చివేత : రాంనగర్‌ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కొన్ని కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశీలించారు. వీటిపై నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులను హైడ్రా కమిషనర్​ రంగనాథ్ ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధరించిన అనంతరం హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు చేపట్టారు.

ఫిర్యాదు ఇచ్చిన రెండ్రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా వరద నీరు వెళ్లేందుకు మార్గం మూసుకోవడంతో ఏటా వర్షా కాలంలో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడం, ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికంగా పలు ఇబ్బందులు గురవుతున్నామని అనేక పర్యాయాలు సంబంధిత అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు చేపట్టలేదు. ఇక తాజాగా హైడ్రా చర్యలతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

అక్కడి కల్లును పారబోసి పూర్తిగా సామగ్రిని తొలగించి, కూల్చివేతలు : గతంలో రెండు పర్యాయాలు ఈ అక్రమ నిర్మాణంపై పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ డెమోలిషన్స్ స్క్వాడ్ భారీ పోలీసు పహారాతో కూల్చివేయడానికి వచ్చి వెను తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 24 అడుగుల వెడల్పు గల లింకు రోడ్డును కబ్జా చేసి ఆస్థలంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఆ భవనంలో ఒకవైపు కల్లు కాంపౌండ్​, ఓ బారు కొనసాగుతోంది. ఎట్టకేలకు హైడ్రా కమిషనర్​కు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అక్రమ కల్లు కాంపౌండ్ కూల్చివేతతో పాటు రోడ్డుపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేయడానికి సిబ్బంది ఉపక్రమించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.

ఆక్రమణల నిర్మాణాలపై హైడ్రా కమిషనర్​ ప్రకటన : మురుగునీటి వ్యవస్థకు అడ్డుపడుతూ అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే రాంనగర్​ మణెమ్మ గల్లీలో ఆక్రమణలు కూల్చివేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ఒక ప్రకటన విడుదల చేశారు. మణెమ్మ గల్లీ వద్ద ప్రజా రోడ్డుపై ఆక్రమణ జరిగిందని, హైడ్రా అధికారుల సమక్షంలో ముషీరాబాద్​ సర్కిల్​ డిప్యూటీ సిటీ ప్లానర్​, రెవెన్యూ అధికారులతో స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు.

ఈ పరిశీలనలో ఆక్రమణకు గురైన భూమి సర్వే నెంబరు 20,21 వార్డు 155 బ్లాక్​ ఏ జమిస్తాన్పూర్​ గ్రామంలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమిలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కల్లు కంపౌండ్​, తాత్కాలిక షెడ్​తో పాటు జీ ప్లస్​ 2 అంతస్తుల భవనాన్ని అనుమతి లేకుండా నిర్మించారని గుర్తించారు. ఆ నిర్మాణాలను తొలగించినట్లు కమిషనర్​ రంగనాథ్​ తెలిపారు.

హిమాయత్‌సాగర్‌ వైపు హైడ్రా బుల్డోజర్లు - ఇక కాంగ్రెస్ నేతల వంతు! - Hydra Demolitions in Himayat Sagar

ఇకపై రెవెన్యూ నోటీసులే షోకాజ్‌ నోటీసులు - హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు - TG HIGH COURT ON REVENUE NOTICES

Last Updated : Aug 30, 2024, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.