ETV Bharat / state

అతిపెద్ద కంట్రోల్​ రూమ్ ఏర్పాటుకు 'హైడ్రా' సన్నాహాలు - ఇక ఎలాంటి విపత్తునైనా! - Hydra with NRSC for Maps

Hydra to Collaborates with NRSC : విపత్తులను ఎదుర్కొనేందుకు హైడ్రా హైదరాబాద్​లో అతిపెద్ద కంట్రోల్​ రూమ్​ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్​ను సందర్శించారు. చెరువులు, నాలాల పాత, కొత్త మ్యాప్‌ల కోసం ఎన్​ఆర్​ఎస్సీ సహకారం తీసుకోనున్నారు. మరోవైపు ఆక్రమణలకు గురైన రూ.1000 కోట్ల విలువైన భూములకు విముక్తి కల్పించినట్లు హైడ్రా వెల్లడించింది.

Hydra to Collaborates with NRSC for Satellite Maps
Hydra to Collaborates with NRSC (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 6:38 AM IST

Updated : Sep 12, 2024, 7:11 AM IST

Hydra to Collaborates with NRSC for Satellite Maps : ఎంత పెద్ద విపత్తునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు హైడ్రా హైదరాబాద్‌లో అతి పెద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్​ను సందర్శించారు. కీలకమైన డేటా కోసం సుమారు మూడు గంటల పాటు ఎన్​ఆర్​ఎస్సీ అధికారులతో చర్చించారు. విపత్తు నిర్వహణలో హైడ్రా ఆలోచనలను అక్కడి అధికారులతో చర్చించారు.

వాతావరణ సూచనలు, వర్షపాతం స్థితిగతులు, విపత్తు నిర్వహణకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు అవసరమైన డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థను రంగనాథ్ పరిశీలించారు. ఈ ఏడాది వరకు ఉన్న చారిత్రక శాటిలైట్ వ్యూ డేటా ఆధారంగా నీటి వనరులు, నాలాలను పర్యవేక్షించడం, కచ్చితమైన ప్రణాళికతో పరిస్థితులను అంచనా వేయడం, భవిష్యత్​లో ప్రణాళికల రూపకల్పన కోసం ఎన్​ఆర్​ఎస్సీ డేటా ఎంతో ఉపయోగపడుతుందని రంగనాథ్ తెలిపారు.

రూ.1000 కోట్ల విలువైన భూములకు విముక్తి : నగరంలోని ఆక్రమణలకు గురైన రూ.1000 కోట్ల విలువైన భూములకు విముక్తి కల్పించినట్లు హైడ్రా తెలిపింది. ఈ మేరకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదిక వివరాల ప్రకారం జూన్‌ 27 నుంచి మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో మొత్తం 111.72 ఎకరాల భూమి ఆక్రమణల చెర నుంచి వీడింది. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల్లో చెరువులు ఎక్కువగా ఉన్నాయని, కొంతమేర బఫర్‌ జోన్, ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మార్కెట్లో వాటి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఖరీదైన ప్రాంతాల్లో : మాదాపూర్‌లో 4.9 ఎకరాల గల తమ్మిడికుంట చెరువు స్థలాన్ని, జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌ కాలనీలో 0.18 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, బంజారాహిల్స్‌ లోటస్‌పాండ్‌ పార్కులో 0.16 ఎకరాలు, చందానగర్‌ ఈర్లచెరువులో 0.16 ఎకరాలు, శాస్త్రిపురం బుమ్రుఖ్‌ నుద్దౌలా చెరువులో 12 ఎకరాలు, ప్రగతినగర్‌ ఎర్రకుంటలో 0.29 ఎకరాల భూములను రక్షించినట్లు హైడ్రా ప్రభుత్వానికి వివరించింది.

వాటితోపాటు గండిపేట జలాశయంలో 15.25 ఎకరాలు, అమీన్‌పూర్‌ చెరువులో 51.78 ఎకరాలు, మాదాపూర్‌ సున్నం చెరువులో 10 ఎకరాలు, దుండిగల్‌ మల్లంపేట చెరువులో 2.5 ఎకరాలు, రాజేంద్రనగర్‌ అప్పా చెరువులో 3.2 ఎకరాలు, ఇతరత్రా విలువైన భూములను ఆక్రమణల నుంచి రక్షించినట్లు ప్రభుత్వానికి తెలిపింది. అయితే హైడ్రా కూల్చిన ఆక్రమణ నిర్మాణాల్లో ఎక్కువగా రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల విల్లాలు, వసతి గృహాలు, వ్యవసాయ క్షేత్రాల్లోని బంగ్లాలు, కన్వెన్షన్‌ హాళ్లు, గోదాములు, అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాలు, రేకుల షెడ్లు ఉన్నట్లు పేర్కొంది.

'ఇప్పటివరకు 262 అక్రమ నిర్మాణాల కూల్చివేత' - ప్రభుత్వానికి హైడ్రా లేటెస్ట్ రిపోర్టు - HYDRA DEMOLITIONS REPORT LATEST

Last Updated : Sep 12, 2024, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.